Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ భారత్‌కు రానున్నాడు. గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025లో భాగంగా హైదరాబాద్ కు రానున్నాడు మెస్సి. కోల్‌కతా, ముంబై, ఢిల్లీతోపాటు మెస్సీ హైదరాబాద్ లో కూడా పర్యటించనున్నాడు.
హైదరాబాద్‌లో జరిగే ప్రోగ్రామ్‌లో ఎంతో మంది సెలెబ్రెటీస్, సినిమా స్టార్స్ కూడా వస్తారని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా మెస్సికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం అని స్పెషల్ గా ఒక ఈవెంట్ ని ప్లాన్ చేసారు. సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, ఫుట్‌బాల్ క్లీనిక్, మెస్సీకి ఫెలిసిటేషన్ ఇవన్నీ నిర్వహించనున్నారు.
డిసెంబర్ 13న కోల్‌కతాలో మెస్సీ ఇండియా టూర్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 13వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 14న ముంబైలో, 15న ఢిల్లీలో టూర్ ముగియనుంది. ఢిల్లీలో పర్యటిస్తున్నప్పుడు ప్రధాని మోదీ మెస్సీ కలుసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.





















