I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
ఐ బొమ్మ రవి కేస్ తెలుగు రాష్ట్రాలనే కాదు..మనదేశంలో పైరసీ సినిమాల ద్వారా నిర్మిస్తున్న వేల కోట్ల చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు పోలీసులు ఐబొమ్మ రవి చేసిన తప్పులను విచారణలో తేల్చి కోర్టు ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదంత ఈజీ కాదు. ఎందుకు కాదు అంటున్నా అంటే ఈ పైరసీ జరిగేది కేవలం ఇండియాలోనే కాదు..దీనికి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడానే తెలియదు. ప్రపంచమంతా విస్తరించుకుపోయిన అతి పెద్ద నేర సామ్రాజ్యాల్లో సినిమా పైరసీ కూడా ఒకటి. డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నంత రిస్క్ ఇందులో ఉండదు... బంగారం, వజ్రాలు స్మగ్లింగ్ కోసం పెట్టినంత డబ్బులు ఇందులో పెట్టక్కర్లేదు. ఐ బొమ్మనే రవినే చూశారుగా ఒక్కడే..సింగిల్ ల్యాప్ ట్యాప్..ఓ చిన్న ఆఫీసుతో ఎన్ని వేలకోట్ల రూపాయలు సినిమా పరిశ్రమకు నష్టం తీసుకువచ్చాడో. దీన్ని టాలెంట్ అంటారా...అయితే చీకటి సామ్రాజ్యం లోతుల్లోకి వెళ్లి ఇదెంత పెద్ద నెట్ వర్కో ఈ వారం టెక్నలాజియాలో తెలుసుకుందాం.
India లో iBomma, Tamilrockers, Movierulz
అదే హాలీవుడ్ లో Putlocker, 123Movies, PirateBay, Soap2Day
Japan & Korea ల్లో KissAnime clones
Africa లో Naijaflix rips
South America లో Cuevana
ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు ఎందెందు వెతికినా అందందే గలడు చక్రి సర్వోపగతుండు అన్నట్లు సినిమా పైరసీ జరగదనే చోటే ఈ లేదు ఈ ప్రపంచం. ఒక్క సైట్ ని కష్టపడి ప్రభుత్వం క్లోజ్ చేస్తే పది మిర్రర్ సైట్లు తెల్లారేసరికి పుట్టుకొస్తాయి. ఎందుకంటే పైరసీ అనేది మిస్టేక్ కాదు..అదో వ్యాపార సామ్రాజ్యం.
ఈ పైరసీ కారణంగా ఏటా భారత చిత్ర పరిశ్రమ 20వేల నుంచి 25వేల కోట్ల రూపాయలు నష్టపోతోంది. హాలీవుడ్ అయితే ఏకంగా 4లక్షల కోట్ల రూపాయలను ఏడాదికి కోల్పోతోంది. ఓటీటీలు, ప్రపంచవ్యాప్తంగా టీవీ ఛానెళ్లు కంటెంట్ పైరసీ కావటం వల్ల మొత్తంగా 7లక్షల కోట్ల వరకూ ఆయా సంస్థలకు లాస్ వస్తోంది.
ఒక సూపర్ హిట్ సినిమా 24 గంట్లలోనే పైరసీ రూపంలో బయటకు వచ్చేస్తుంటే బాక్సాఫీస్ కుప్పకూలినట్లే. అదే చిన్న సినిమా పైరసీ అయితే ఏకంగా ఆ నిర్మాత, ఆ చిత్ర బృందం పడిన కష్టం అంతా బూడిదలో పోసినట్లే. ఇంకెప్పుడూ వాళ్లు సినిమా కూడా తీయలేరు మళ్లీ. ఇది కేవలం రెవెన్యూ లాస్ మాత్రమే కాదు. క్రియేటివిటీని చంపేయటం కూడా.
పైరసీ కోసం స్టార్టింగ్ లో థియేటర్లో ఓ మనిషి కూర్చుని కష్టపడి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి పైరసీ సైట్ లో అప్లోడ్ చేసేవారు. అదంతా అప్పుడు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడంతా హ్యాకింగ్, ట్రెస్ పాసింగ్, ఫిషింగ్ జమానా. సినిమాను రిలీజ్ చేయాలకునే ముందు రోజు క్యూబ్ , UFO, డాల్బీ IMS సర్వర్స్ లో కి ట్రాన్ ఫర్ చేస్తారు. సర్వర్స్ అన్నీ ఎన్ క్రిప్టెడే ఉంటాయి కానీ వాటి లాగిన్ ఐడీ పాస్వర్డ్స్ ను ట్రోజన్స్ యూజ్ చేసి హ్యాక్ చేస్తారు. ఎక్కడో ఓ చోట దొరికిపోతుంది కంటెంట్. ఇకంతే ట్రాన్స్ ఫర్ డన్. సినిమా రిలీజైన గంట్లోనే 4K లో సినిమాను పైరసీ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసేస్తారు. ఐబొమ్మ రవి లాంటోళ్లు సింగిల్ ల్యాప్ ట్యాప్ తో చేసిన విధ్వంసం ఇదే.
మరి వీళ్లు ఇంతిలా రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అని మనం సినిమా డైలాగులు వేస్తాం. కానీ ఈ పైరసీ బ్యాచ్ సర్వర్లు ఒక్కటి కూడా ఇండియాలో ఉండవు. కురాకో, సీషెల్స్, బ్రిటీష్ వర్జీనియా ఐలాండ్స్, బెలీజ్, ఆంటిగ్వా ఇలా పద్ధతి పాడు రూల్స్ గీల్స్ లేకుండా వచ్చే జనాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేసి పన్నులు కూడా వేయకుండా కొద్ది పాటి అమౌంట్ ను ఫీజుల రూపంలో తీసుకునే ద్వీపదేశాల్లో ఈ పైరసీ గాళ్ల సర్వర్లు ఉంటాయి. ఈ దేశాలు ఎంత ఎడమెంట్ గా ఉంటాయంటే కనీసం ఇంటర్ పోల్ ఇచ్చే రెడ్ కార్నర్ నోటీసులకు కూడా రెస్పాండ్ కారు. వాళ్ల దేశాల్లో విచిత్రమైన రూల్స్ పెట్టుకుని బయట వ్యక్తులను ఎంక్వైరీలకు కూడా కనీసం ఎలో చేయరు. వీళ్ల మీద యుద్ధం చేద్దాం అంటే చాలా ద్వీప దేశాలకు కనీసం ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా ఉండదు. ఇంకెలా...అందుకే పైరసీ కేటుగాళ్లు రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఐ బొమ్మ రవి కేస్ కూడా అంతేగా. కరీబియన్స్ ఐలాండ్స్ నుంచి ఫసిఫిక్ ఐలాండ్స్ వరకూ మారుతూ ఉంటాడట దేశ దేశాలు. మన తెలంగాణ హైదరాబాద్ పోలీసులు ఎక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు..ఈ రవి లాంటోళ్లు తప్పు చేశారని ఎలా ప్రూవ్ చేస్తారు.
వీళ్లకు ఫండింగ్ అంతా బెట్టింగ్ యాప్స్ నుంచి క్రిప్టోస్ కాసినోల నుంచి, మాల్వేర్ యాప్స్ నుంచి వస్తూ ఉంటుంది. సినిమాకు ఇంత అమౌంట్ అని..నెలా నెలా ఇంత అని కొన్ని కోట్ల రూపాయలను హ్యాకర్లకు ట్రాన్ ఫర్ చేసి సినిమా పైరసీ సైట్లకు ఫండింగ్ చేస్తుంటారు. రీజన్ ఈ సైట్స్ కి వచ్చే ట్రాఫిక్ ను వాళ్లు వాడుకోవటానికే. గాలం వేసే ముందు దానికి తగిలించే ఎర ఈ పైరసీ సైట్లో కనిపించే కొత్త సినిమాలు అయితే...పడే పెద్ద పెద్ద అమాయకపు చేపలు మాములు జనాలే.
ఏదైనా పైరసీ సైట్ లో డౌన్లోడింగ్ కి మన డేటా తీసుకుంటుంది అంటే ఆ ఏం ఉంది మన డేటా తీసుకుంటే పోవటానికి నా దగ్గరేమన్నా లక్షల కోట్లు ఉన్నాయా..గట్టిగా ఐదొందలు కూడా ఉండవు నా అకౌంట్లో. పైరసీ చూడటం తప్పంటే చాలా మంది చెప్పే కామన్ డైలాగ్. కొంత మందికి పాప్ కార్న్ ల నుంచి మంచినీళ్ల వరకూ వందలు, వేలు దోచుకునే మల్టీప్లెక్సులతో ఇష్యూ. టిక్కెట్ రేట్లు ఇష్టానికి పెంచేసుకుని అమ్మేసుకునే ప్రొడ్యూసర్లు, అభిమానుల ఎమోషన్స్ ను వాడుకుని సంపాదించుకునే డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు..సరే ఇలా చెప్పుకుంటూ పైరసీ ఎందుకు చూస్తున్నారు జనాలు అనే దానికి వంద రీజన్లు ఉంటున్నాయి. కానీ వీటన్నింటికి సొల్యూషన్ పైరసీ లో సినిమా చూసేయడమేనా అంటే మనం ఎంత పెద్ద నెట్ వర్క్ లూప్ లోకి జారిపోతున్నామో ఓ సారి చూద్దాం.
ఏ పైరసీ సైట్ లో మీరు సినిమా చూసినా మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడీ, మీ డివైస్ ఐడీ, మీ లొకేషన్, ఐపీ, కాంటాక్ట్స్ యాక్సెస్, మీ కుకీస్, మీ క్లిప్ బోర్డ్, మీ కెమెరా యాక్సెస్ అన్నీ ఆ పైరసీ సైట్ వాడి చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. ఎందుకంటే వాడు డౌన్లోడ్ అని మీకు కనిపించే బటన్ కిందే ఈ యాక్సెస్ లు అన్నీ పెట్టుకుంటాడు. కొన్ని సైట్లు మిమ్మల్ని అడుగుతాయి కూడా మనం సినిమా ఫ్రీగా చూసేయొచ్చు కదా అని ఇచ్చేస్తాం.
2024 లో హైదరాబాద్ యాకుత్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఓ కుర్రాడి బ్యాంక్ అకౌంట్ లోకి 42వేల రూపాయలు వచ్చి పడ్డాయి. చెక్ చేశాడు..ఎక్కడి నుంచి వచ్చాయనేది ఓ నెంబర్ ఉంది కానీ ఎలాంటి డీటైల్స్ లేవు. రెండు మూడు రోజులు చూశాడు ఎవరూ అడగట్లేదు తనకు కాల్ చేసి. సరే డబ్బులు పడ్డాయి కదా ఖర్చులకు వాడుకున్నాడు. నెల రోజుల తర్వాత ఓ లోన్ యాప్ వాళ్లు కాల్ చేసి డబ్బులు తిరిగి కట్టమని అడగటం మొదలుపెట్టారు. అది కూడా దాదాపుగా లక్ష రూపాయలు. అసలు నేనేక్కడ డబ్బులు ఇవ్వమని అడగలేదు. మీరే వేశారు..ఇప్పుడంత డబ్బు కట్టమంటే ఎలా అని అడిగాడు. వేధింపులు ఎక్కువయ్యే సరికి ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి రీజన్ ఏంటని దర్యాప్తు చేసిన పోలీసులకు తెలిసింది ఏంటంటే ఆ కుర్రాడు పైరసీలో సినిమాలు చూసేవాడు. తన యాక్సెస్ లను తెఫ్ట్ చేసి పైరసీ వెబ్ సైట్ ఆ డేటాను లోన్ యాప్స్ కంపెనీకి అమ్మేసింది. వాళ్లు ఆ కుర్రాడి మెయిల్ కి యాక్సెస్ అయ్యి తనకు తెలియకుండానే తన ఆధార్ ను డౌన్లోడ్ చేసుకుని...లోన్ తీసుకున్నట్లుగా బాండ్ క్రియేట్ చేసి నెల రోజుల తర్వాత డబ్బులు కోసం వేధించినట్లు గుర్తించారు పోలీసులు. ఎంత పెద్ద స్కామ్ ఇది. ఆ కుర్రాడు చేసిన తప్పు ఏంటి పైరసీలో సినిమాలు చూడటం.
జుమ్ము కశ్మీర్ లో 2025 లో పహల్గాం ఎటాక్ తర్వాత ఆపరేషన్ సిందూర్ టైమ్ లో ఓ ఉగ్ర మూలాలన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఎలాంటి లింక్స్ ను నడుపుతున్నాడు ఎవరెవరి మాట్లాడుతున్నాడు ట్రేస్ చేసి చూస్తే ఆ ఉగ్రవాది సంభాషణలు చేస్తుంది నడుపుతున్న నెంబర్లు ఈమెయిల్ అన్నీ కూడా తమిళనాడులోని మరో వ్యక్తికి సంబంధించినవి. వీళ్లేకమన్నా లింక్ ఉందా అని NIA ఎంక్వైరీ చేసింది. ఈ ఎంక్వైరీ లో తేలింది ఏంటంటే తమిళనాడులో ఉన్న వ్యక్తి పైరసీలో సినిమాలు చూస్తాడు. సో అతని ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ రెండూ క్లోనింగ్ చేసుకున్న హ్యాకర్స్ వాటిని డార్క్ వెబ్ లో ఉగ్రవాద సంస్థలకు అమ్మేశారు. డీటైల్స్ అన్నీ తమిళనాడులో ఉన్న ఇన్నోసెంట్ అండ్ పైరసీ సినిమాలు చూసుకునే వ్యక్తివి..కానీ అతని ఐడెంటెటీని వేరే వాళ్లు వాడుకుని అక్కడ ఏకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఇక్కడ తప్పు ఎవరిది.?
సో అర్థం అవుతోంది కదా ఇదెంత ఫ్రాడ్ నెట్ వర్కో. మనం చూసే పైరసీ సినిమా చాటున ఎంత పెద్ద నేర సామ్రాజ్యాలు రన్ అవుతున్నాయో. ఇప్పుడు చెప్పండి ఐబొమ్మ రవి దేవుడా నేరస్తుడా...మల్టీ ప్లెక్సుల వాళ్లు దోచుకోవట్లేదు...టిక్కెట్లు రేట్లు పెంచి ప్రొడ్యూసర్లు తినట్లేదు అనట్లేదు. అది సపరేట్ ఇష్యూ..వాళ్లంతా కంటికి కనిపించే వ్యవస్థలు,..మనుషులు మనం పోరాటం చేయొచ్చు. బట్ నేను చెప్పిందంతా డార్క్ వరల్డ్. కనీసం కంటికి కనిపించరు ఆ మనుషులు...ఆ వ్యవస్థలు. మీ అభిప్రాయం ఏంటీ కామెంట్ రూపంలో చెప్పండి. ఇదీ ఈ వారం టెక్నలాజియా..వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం.





















