BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీను త్వరలోనే బీసీసీఐ పెద్దలు కలవబోతున్నారట. ఈ సమావేశంలో హెడ్ కోచ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఉండడనున్నారట.
అయతే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన తర్వాత స్పెషల్ గా జరుగుతున్న సమావేశం ఇదే కావడం విశేషం.
రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఆడతారని స్వయంగా వాలే చెప్పుకొచ్చారు. వరల్డ్ కప్ వరకు కొనసాగాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడటం, ఫిట్‌నెస్-ఫామ్ ను కాపాడుకోవాలి. కాబట్టి ఇలాంటో విషయాల గురించి బీసీసీఐ ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడరు కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ కోసం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలని కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కు బీసీసీఐ సలహా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు క్రికెట్ నిపుణులు. అలాగే ఈ సమావేశంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. 2027 వన్డే వరల్డ్ కప్, టీమ్ కు సంబంధించి తీసుకునే నిర్ణయాలు, ప్లేయర్స్ సెలక్షన్... ఇలా పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.





















