India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో భారతను ఓడించింది. ఇప్పుడు వన్డే సిరీస్ తో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది భారత్. రాంచి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి టీమ్ లోకి వచ్చారు. రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే యశస్వి జైస్వాల్ రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కెప్టెన్ బాధ్యతలు కేఎల్ రాహుల్‌కే దక్కాయి. గత కొంతకాలంగా రిషబ్ పంత్ వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. కాబట్టి రాహుల్ వికెట్ కీపింగ్ కు వచ్చే అవకాశాలే ఎక్కువ. రిషబ్ పంత్ స్థానంలో యంగ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడే అవకాశం ఉంది.రాంచీ మైదానంలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీసే అవకాశం ఎక్కువ. వాతావరణం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ఎక్స్ ఫ్యాక్టర్ కావచ్చు. దీనివల్ల సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టమవుతుంది.
బాల్ పాతబడిన కొద్దీ స్పిన్నర్లకు పిచ్ హెల్ప్ అవుతుంది. రాత్రి వేళ మంచు కురవకపోతే స్పిన్నర్లు బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయిస్తారు.





















