Lord Ganesha: కలలో కనిపించిందే నిజమైంది.. మర్రిచెట్టు నుంచి ఉద్భవించిన వినాయకుడు!
Siddheshwaram: తవ్వకాల్లో పురాతన ఆలయాలు, విగ్రహాలు బయటపడడం చూసి ఉంటాం. కానీ చెట్టునుంచి ఉద్భవించిన విగ్రహాన్ని చూశారా? నిత్యం పూజలందుకుంటున్న ఆ విగ్రహం ఎక్కడుంది?ఆ విశేషాలేంటో చూద్దాం..

Lord Ganesha: పురాతన తవ్వకాల్లోంచి బయటపడిన విగ్రహం కాదిది..మర్రిచెట్టులోంచి ఉద్భవించిన గణపయ్య. స్వామివారి రూపాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. నిత్య పూజలందిస్తూ తాము ప్రారంభించిన పనిలో విఘ్నాలు లేకుండా దీవించమని ప్రార్థిస్తున్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధి జూపాడు బంగ్లా మండలం కొత్త సిద్దేశ్వరం గ్రామంలో ఊడల మర్రిచెట్టులో స్వయంభుగా వెలసిన బొజ్జ గణపయ్యకు పూజలందిస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఈ గ్రామం సంగమేశ్వరం పక్కన ఉండేది. అప్పట్లో ఆ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అదేవిధంగా సున్నిపెంట గ్రామానికి మధ్యలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కట్టడంతో ఈ సిద్దేశ్వరం గ్రామం నీటిలో మునిగిపోయింది. తప్పని పరిస్థితుల్లో ఆ ఊరిని వదిలి వెళ్లిపోవాల్సివచ్చింది. ఆ తర్వాత ఈ ఊరివారికోసం ప్రభుత్వం వారు జూపాడుబంగ్లా మండలంలో ఉన్న పోరంబోకు స్థలంలో ఈ గ్రామాన్ని నిర్మించారు. ఆ గ్రామం పేరు కొత్త సిద్దేశ్వరం అని ఫిక్స్ చేశారు. అప్పటినుంచి ఆ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ శివాలయాన్ని నిర్మించుకున్నారు . ఆ శివాలయానికి ఎదురుగాని ఒక పురాతనమైన బావిని అప్పట్లోనే ఏర్పరచుకున్నారు, ఆ బావిలో ప్రతి శివరాత్రి పర్వదినాన ఆ గ్రామ ప్రజలందరూ అక్కడ స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు.
స్వామివారికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చిన లింగమయ్య అనే వ్యక్తి తన మనసులో ఉన్న బాధను స్వామివారికి తెలుపుతూ అలాగే ధ్యానంలో కూర్చుని ఉండిపోయాడు. తనకి కలలో ఓ మర్రి చెట్టులో బొజ్జ గణపయ్య రూపం ఉన్నట్టు కనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. కలలో కనిపించిన ప్రదేశం దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ నిజంగానే మర్రిచెట్టు ఊడలలో వినాయకుని రూపం కనపడింది. ఆశ్చర్యపోయి గ్రామస్తులందరిని పిలిచి చూపించాడు. వెంటనే గణపయ్యకి పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలవారికి కూడా ఈ విషయం తెలియడంతో అంతా క్యూ కట్టడం మొదలుపెట్టారు. నిత్యం వినాయకుడికి పూజలు చేస్తూ విఘ్నాలు కలగకుండా విజయాన్ని సిద్ధింపచేయమంటున్నారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ సిద్ధగణపతి ధ్యానం
పక్వచూతఫలపుష్పమంజరీ ఇక్షుదండతిలమోదకైస్సహ |
ఉద్వహన్ పరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమపింగళః ||
శ్రీ ఉచ్ఛిష్టగణపతి ధ్యానం
నీలాబ్జదాడిమీవీణాశాలీ గుంజాక్ష సూత్రకమ్ | దధదుచ్ఛిష్టనా మాయం గణేశః పాతుమేచకః ||
ప్రకాంతరేణ సారీయోనిరసాస్వాదలోలుపం కామమోహితమ్ ||
శ్రీ విఘ్నగణపతి ధ్యానం
శంఖేక్షుచాపకుసుమేషుకుఠారపాశ చక్రస్వదంతసృణిమంజరి కాశరౌఘైః |
పాణిశ్రితైః పరిసమీహితభూషణశ్రీ ర్విఘ్నేశ్వరో విజయతే తపనీయగౌరః ||
శ్రీ క్షిప్రగణపతి ధ్యానం
దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ ||
శ్రీ హేరంబగణపతి ధ్యానం
అభయవరదహస్తః పాశదంతాక్షమాలా సృణిపరశుదధానో ముద్గరం మోదకం చ |
ఫలమధిగతసింహః పంచమాతంగవక్త్రో గణపతి రతిగౌరః పాతు హేరంబనామా ||
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















