Chaitra Purnima 2025 Date: చైత్ర పూర్ణిమ ఎప్పుడు, ప్రాముఖ్యత ఏంటి, ఈ రోజు సముద్ర స్నానం చేయాల్సిన టైమింగ్స్!
Chaitra Purnima 2025: ఏప్రిల్ 12 చైత్ర పౌర్ణమి. ఈ రోజు విశిష్టత ఏంటి? ఏం చేయాలి? పూజా విధానం ఏంటి? ఇక్కడ తెలుసుకోండి

Significance of Chaitra Purnima 2025: సంవత్సరంలో 12 పూర్ణిమలు ఉంటాయి . చైత్రమాసంలో వచ్చే పూర్ణిమను హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ విజయోత్సవాన్ని జయంతిగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం జరుగుతుంది.
2025 చైత్ర పూర్ణిమ సమయం
ఈ ఏడాది చైత్ర పూర్ణిమ ఏప్రిల్ 12 శనివారం వచ్చింది. ఇదే రోజు హనుమాన్ విజయోత్సవం కావడంతో రామచరితమానసం, సుందరకాండ పారాయణ చేస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇదోరోజు హనుమాన్ పూజతో పాటూ లక్ష్మీపూజ చేస్తారు. సాయంత్రం సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఇదే రోజు సత్యనారాయణ పూజ నిర్వహించే సెంటిమెంట్ కొందరికి ఉంటుంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
చైత్ర పూర్ణిమ 2025 ముహూర్తం
చైత్ర పూర్ణిమ 2025 ఏప్రిల్ 11 శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల 24 నిముషాలకు పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయి
ఏప్రిల్ 12 శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత 4 గంటల 18 నిముషాల వరకూ పౌర్ణమి ఘడియలున్నాయి.
సాధారణంగా అన్ని తిథులు సూర్యోదయానికి ఉండేలా చూసుకుంటే పౌర్ణమి మాత్రం సూర్యాస్తమయానికి ఉండేలా చూసుకుంటారు. అంటే ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి.
హస్త నక్షత్రం సాయంత్రం 5.11 వరకు..తదుపరి చిత్త నక్షత్రం ప్రారంభం
అమృత ఘడియలు 10.38 నుంచి 12.23 వరకు
దుర్ముహూర్తం ఉదయం 7.29 వరకు...
వర్జ్యం ఏప్రిల్ 14 అర్థరాత్రి 1.58 నుంచి 3.44 వరకు
సూర్యోదయం ఉదయం 5.52
సూర్యాస్తమయం సాయంత్రం 6.10 వరకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయడం అత్యంత విశేష ఫలం అని చెబుతారు పండితులు
పూర్ణిమ స్నాన ముహూర్తం - ఏప్రిల్ 12 తెల్లవారు జామున 4.29 నుంచి 5.14 లోపు
సత్యనారాయణ పూజ నిర్వహించాలి అనుకుంటే - ఉదయం 7.35 నుంచి 9.10 లోపు ప్రారంభించవచ్చు
చంద్రోదయ సమయం - సాయంత్రం 6.18
హనుమంతుని పూజకు ఈ రోజంతా శుభకాలం. అయితే బజరంగబలి పూజ ఉదయం లేదా సాయంత్రం చేయాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాల ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన వివరాలు ఇవి. వీటిని ఏబీపీ దేశం ధృవీకరించడం లేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ముఖ్యంగా చైత్ర పౌర్ణమి రోజు సూర్యోదాయనికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. శివకేశవుల పూజ, సత్యనారాయణపూజ, లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. ఈరోజంతా ఉపవాసం ఆచరించి..దాన, ధర్మాలు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు.
పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు అని చెబుతారు. అందుకే కావాల్సినంత మానసిక బలం చేకూరుతుంది. జీర్ణక్రియను మెరుగుపడుతుంది. మానవ శరీర వ్యవస్థను శుద్ధి చేస్తుంది.
చైత్ర పౌర్ణమి రోజు నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందుతారని పండితులు చెబుతారు.
చైత్ర పౌర్ణమి రోజు లలిత సహస్ర నామ పారాయణ చోస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం






















