Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Telangana Student Died in Germany:జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. అతను ఉండే అపార్టమెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. తప్పించుకునేందుకు దూకడంతో హృతిక్ రెడ్డి చనిపోయాడు.

Telangana Student Died in Germany: ప్రపంచమంతా 2026 నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ, జర్మనీ నుంచి వచ్చిన ఒక చేదు వార్త తెలంగాణలోని ఓ కుటుంబంలో విషాదం నింపింది. తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం జర్మనీ వెళ్లి, అక్కడ జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నూతన సంవత్సరం ఆరంభంలోనే ఈ దుర్ఘటన జరగడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.
మల్కాపూర్ నుంచి వచ్చిన హృత్రిక్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని, తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని కలలుకన్నాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన హృతిక్ జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించడం తన కుటుంబానికి ఎంతో గర్వకారణంగా భావించాడు. అక్కడే ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో అతని ఆశయాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి.
ప్రమాదం అసలు ఎలా జరిగింది?
జర్మనీ అధికారుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, జనవరి 1న హృతిక్ నివసిస్తున్న అపార్టమెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హృతిక్ లోపలే ఉన్నాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు వచ్చే మార్గం కనిపించక ప్రాణ భయంతో వేగంగా వ్యాపించడంతో బయటకు వచ్చే మార్గం కనిపించక ప్రాణ భయంతో అతను కిటికీ నుంచి కిందకు దూకాడు. ఈ క్రమంలో అతని తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు. భవనంపై నుంచి దూకం, తలకు గాయం కారణంగా యువకుడు మరణించాడని జర్మన్ అధికారులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై జర్నన్ పోలీసులు లోతైన ద్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటీ, భవనంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. భారత రాయబారి కార్యాలయం ఈ విషయంలో యాక్టివ్‌గా స్పందించింది. హృతిక్ రెడ్డి కుటుంబానికి సమాచారం అందించడంతోపాటు మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. ఎంబసీ అధికారులు జర్మన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవసరమైన పేపర్ వర్క్ , క్లియరెన్స్‌లను పూర్తి చేస్తున్నారు.
మల్కాపూర్‌లో విషాద ఛాయలు
హృతిక్ మరణవార్త మల్కాపూర్ గ్రామానికి చేరగానే అక్కడ నిశ్శబ్ధ వాతావరణం ఏర్పడింది. తన కుమారుడు ఉన్నత చదువులు చదివి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, నూతన సంవత్సర కానుకా శవమై వస్తున్నాడన్న వార్త విని గుండ పగిలేలా విలపిస్తున్నారు. గ్రామస్తులు, బంధువులు హృతిక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తరలి వస్తున్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఒక ఆదర్శంగా నిలిచిన హృతిక్ ఇలాంటి స్థితిలో తిరిగి రావడం గ్రామ యువతను కూడా కలిచి వేస్తోంది.





















