RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులు
ఎవరికైనా సొంత మైదానం అంటే కంచుకోట లా ఉంటుంది. ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్ కి చెపాక్ స్టేడియం కంచుకోట. మొన్నే 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ చెన్నైలో ఓ మ్యాచ్ గెలిచింది. అంటే ఇన్నేళ్లుగా తన కోటను చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కాపాడుకుంటూ వస్తున్నారు. ముంబై ఇండియన్స్ కి వాంఖడే కూడా అంతే. 10ఏళ్ల తర్వాత ముంబైని వాంఖడే లో ఓడించింది ఆర్సీబీ. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా పక్క టీమ్ ల కోటలపై విజయం సాధిస్తున్న తన సొంత గడ్డపై మాత్రం విక్టరీలు అందుకోలేకపోతోంది ఆర్సీబీ. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో హోం గ్రౌండ్ అయిన బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో ఓడిపోయింది ఆర్సీబీ. ఇది మొత్తంగా ఆర్సీబీకి బెంగుళూరులో 45వ ఓటమి. ప్రతీ టీమ్ దాదాపుగా 7 మ్యాచులు సొంత మైదానంలో ఆడతాయి. అలాంటిది 45 మ్యాచులు బెంగుళూరులోనే ఓడిపోయిన ఆర్సీబీ ఓ మైదానంలో అతి ఎక్కువ సార్లు ఓడిపోయిన టీమ్ గా ఢిల్లీని దాటి చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ చిన్న స్వామి తర్వాత ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం ఉంది. అక్కడ 44 మ్యాచులు
ఓడిపోయింది ఢిల్లీ. ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లో 38 మ్యాచులు ఓడిపోయింది. సో ఆర్సీబీకి సొంత గ్రౌండ్ బెంగుళూరు చిన్న స్వామి స్టేడియం అంతగా కలిసి రావటం లేదు అన్నమాట. అందుకే ఆర్సీబీ కి హోం అంటే చిన్నస్వామి కానీ ఓటముల్లో మాత్రం దొడ్డ స్వామి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





















