HAL: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 98 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 98
రిజర్వేషన్: యూఆర్- 36, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 37, ఎస్సీ- 04, ఎస్టీ- 02, ఈడబ్ల్యూఎస్- 19.
⏩ డిప్లొమా టెక్నీషియన్(మెకానికల్)(స్కేల్-D6): 20 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 11, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 07, ఈడబ్ల్యూఎస్- 02.
అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు (జనరల్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13, ఎస్సీ/ ఎస్టీ- 15) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
⏩ డిప్లొమా టెక్నీషియన్(ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్)(స్కేల్-D6): 26 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 15, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 07, ఎస్సీ- 01, ఈడబ్ల్యూఎస్- 03.
అర్హత: ఇంజినీరింగ్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ &కామ్./ ఎలక్ట్రికల్ &ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ &ఇన్‌స్ట్రుమెంటేషన్)లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు (జనరల్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13, ఎస్సీ/ ఎస్టీ- 15) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
⏩ ఆపరేటర్(ఫిట్టర్)(స్కేల్ - C5): 34 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 15, ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఈడబ్ల్యూఎస్- 11.
అర్హత: ఎన్‌ఏసీ/ఎన్‌సీటీవీటీచే గుర్తింపు పొందిన ఐటీఐ(ఫిట్టర్ ట్రేడ్)లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు (జనరల్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13, ఎస్సీ/ ఎస్టీ- 15) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
⏩ ఆపరేటర్(ఎలక్ట్రీషీయన్)(స్కేల్ - C5): 14 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 07, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 05, ఈడబ్ల్యూఎస్- 02.
అర్హత: ఎన్‌ఏసీ/ఎన్‌సీటీవీటీచే గుర్తింపు పొందిన ఐటీఐ(ఎలక్ట్రీషీయన్ ట్రేడ్)లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు (జనరల్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13, ఎస్సీ/ ఎస్టీ- 15) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
⏩ ఆపరేటర్(మెషనిస్ట్)(స్కేల్ - C5): 03 పోస్టులు
రిజర్వేషన్: ఓబీసీ(ఎన్‌సీఎల్)- 02, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: ఎన్‌ఏసీ/ఎన్‌సీటీవీటీచే గుర్తింపు పొందిన ఐటీఐ(మెషనిస్ట్ ట్రేడ్)లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు (జనరల్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13, ఎస్సీ/ ఎస్టీ- 15) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
⏩ ఆపరేటర్(షీట్ మెటల్ వర్కర్)(స్కేల్ - C5): 01 పోస్టు
రిజర్వేషన్: ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.
అర్హత: ఎన్‌ఏసీ/ఎన్‌సీటీవీటీచే గుర్తింపు పొందిన ఐటీఐ(షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్)లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31.03.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు (జనరల్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13, ఎస్సీ/ ఎస్టీ- 15) సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.47,868, ఆపరేటర్ పోస్టులకు రూ.45,852.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.04.2025.