Krrish 4: హృతిక్ రోషన్ బిగ్గెస్ట్ మూవీ 'క్రిష్ 4'పై బిగ్ అప్ డేట్ - ఆ స్టార్ హీరోయిన్ కన్ఫామ్ అయిపోయిందిగా!
Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ ఐకాన్ హృతిక్ రోషన్ హిట్ ఫ్రాంచైజీలో భాగంగా 'క్రిష్ 4' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నారు.

Priyanka Chopra In Hrithik Roshan Movie Krrish 4: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ 'కోయి మిల్ గయా' (క్రిష్). ఈ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి 3 భాగాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'క్రిష్ 4' (Krrish 4) కోసం పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'క్రిష్ 4'లో స్టార్ హీరోయిన్
'క్రిష్ 4' సినిమా ప్రకటన విడుదలైన నాటి నుంచి ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై సోషల్ మీడియా వేదికగా పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నారు. నిజానికి హృతిక్, ప్రియాంకలది హిట్ కాంబో. కోయి మిల్ గయా నుంచి క్రిష్ 3 వరకూ వీరి కాంబో మంచి సక్సెస్ సాధించింది. దీంతో ప్రాంఛైజీలో భాగంగా 'క్రిష్ 4'లోనూ ఆమె నటించనున్నారు.
ఇటీవల ప్రియాంక బాలీవుడ్ వదిలేసి హాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తాజాగా.. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న క్రేజీ మూవీ 'SSMB29'లో ఆమె నటిస్తున్నారు. మరోవైపు.. అల్లు అర్జున్, అట్లీ తాజా సినిమా #AA 22 సినిమాలో ఛాన్స్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్? - సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తారా?
మెగా ఫోన్ పట్టనున్న హృతిక్
'క్రిష్ 4' సినిమాకు ఆదిత్య చోప్రా, రాకేష్ రోషన్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. ఫస్ట్ టైం హృతిక్ హీరోగా నటిస్తూనే మెగా ఫోన్ పట్టబోతున్నారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్లో ఫుల్ జోష్ నెలకొంది. 2026 ప్రారంభంలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు YRFలో జోరుగా సాగుతున్నాయి. మరోవైపు, హృతిక్ తన రచయితల బృందంతో కలిసి పనిచేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో సూపర్ అడ్వంచర్‌గా సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినీ చరిత్రలోనే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆడియన్స్‌కు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందనే టాక్ వినిపిస్తోంది.
క్రిష్ ఫ్రాంచైజీ.. బిగ్గెస్ట్ హిట్
క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటివరకూ వచ్చిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. 2003లో విడుదలైన 'కోయి మిల్ గయా' మూవీతో 'క్రిష్' యూనివర్స్‌ను దర్శకుడిగా, నిర్మాతగా క్రియేట్ చేశారు రాకేష్ రోషన్. ఇందులో రేఖ, ప్రీతి జింటా, రాకేష్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రేక్షకులకు మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
ఈ సినిమాకు సీక్వెల్‍గా 2006లో 'క్రిష్' మూవీని తెరకెక్కించగా అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో హృతిక్, ప్రియాంక చోప్రా నటించారు. ఇందులో సూపర్ హీరోగా క్రిష్ చేసే సాహసాలు అటు పిల్లలతో పాటు పెద్దలను సైతం ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకు సీక్వెల్‌గా 'క్రిష్ 3' మూవీ 2013లో వచ్చింది. ఇప్పుడు తాజాగా క్రిష్ 4 తెరకెక్కుతోంది. దీంతో సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















