Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
స్టార్ బ్యాటర్, టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ టీమ్ కోసం కాదు.. విజయ్ హజారే ట్రోఫీలో. ప్రతి భారత ఆటగాడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అంటూ బీసీసీఐ కొత్తగా రూల్ తీసుకురావడంతో రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాలు కూడా ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగానే తాజాగా విరాట్ కూడా ఢిల్లీ తరపున ఆడటానికి ఆల్రెడీ డీడీసీఏకి మెసేజ్ పంపించగా.. డీడీసీఏ కూడా ఓకే చెప్పేసింది. దీంతో 24వ తేదీన ఆంధ్రాతో, 26వ తేదీన గుజరాత్‌తో జరగబోయే మొదటి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ బరిలోకి దిగబోతున్నాడు. విచిత్రం ఏంటంటే.. ఢిల్లీ జట్టుకి ప్రస్తుతం పంత్ కెప్టెన్‌గా, ఆయుష్ బదోనీ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. అంటే పంత్ కెప్టెన్సీలో కోహ్లీ ఆడబోతున్నాడన్నమాట. ఇదిలా ఉంటే.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత కోహ్లీ మళ్లీ విజయ్ హజారే ట్రోఫీలో అడుగుపెట్టాడు. చివరిసారిగా 2009, 2010 ఎడిషన్‌లో బరిలోకి దిగిన కోహ్లీ.. 14 మ్యాచ్‌ల్లో 106 స్ట్రైక్ రేట్‌తో, 68.25 యావరేజ్‌తో 4 సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు బాది ఏకంగా 819 రన్స్‌తో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక రీసెంట్‌గా సఫారీలతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో ఫుల్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. మరి డిమెస్టిక్ క్రికెట్‌లో ఏ రేంజ్‌లో రాణిస్తాడో చూడాలి.





















