Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Shubman Gill వల్లే యశస్వి జైస్వాల్ కి అన్యాయం జరిగిందంటూ టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఈ మధ్యనే బీసీసీఐ ఇండియన్ స్క్వాడ్ ని అనౌన్స్ చేసింది కదా! అయితే ఈ స్క్వాడ్ లో జైస్వాల్ కి ప్లేస్ దక్కకపోవడంపై రియాక్ట్ అయిన ఆకాష్ చోప్రా.. ‘జైస్వాల్ పర్ఫెక్ట్ t20 ప్లేయర్. 2024 t20 World Cup టైం లో కూడా అప్పట్లో t20 ల్లో సెంచరీ బాది దూసుకుపోతున్న జైస్వాల్ ని.. గిల్ ని కూడా కాదని సెలెక్ట్ చేసింది బీసీసీఐ. కానీ రోహిత్ శర్మ టీంలో ఉండటంతో బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత t20ల్లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లు బాగా ఆడటంతో జైస్వాల్ కి ప్లేస్ లేకుండా పోయింది. అదే టైంలో గిల్ టీంలోకి రావడం.. వైస్ కెప్టెన్ కావడంతో ఇక జైస్వాల్ ని పట్టించుకోలేదు. కానీ గిల్ చెత్త ఫామ్ తో ఉండటంతో అతన్ని పక్కన పెట్టిన బీసీసీఐ నిజానికి జైస్వాల్ ని తీసుకోవాలి. కానీ సంజు లా కీపర్ కూడా కావాలి కాబట్టి ఇషాన్ కిషన్ ని సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఏది ఏమైనా గిల్ కారణంగానే జైస్వాల్ కి టీం లో ప్లేస్ లేకుండా పోయింది.‘ అన్నాడు చోప్రా. అంతే కాకుండా అప్‌కమింగ్ ఐపీఎల్ జైస్వాల్‌కు చాలా ఇంపార్టెంట్ అని.. అక్కడ రాణిస్తే మళ్లీ టీంలోకి ఎంట్రీ ఇవ్వోచ్చని చెప్పుకొచ్చాడు.





















