అన్వేషించండి

Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

Aadi Sai Kumar : 'శంబాల' థియేటర్లలో చూస్తేనే ఆడియన్స్ మంచి ఎక్స్‌పీరియన్స్ పొందుతారని హీరో ఆది సాయికుమార్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు షేర్ చేసుకున్నారు.

Aadi Sai Kumar About Shambala Movie : టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ చాలా రోజుల గ్యాప్ తర్వాత సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేయగా... ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ఆది మూవీ గురించి ఎన్నో విశేషాలు షేర్ చేసుకున్నారు.

'శంబాల' థియేటర్లలోనే చూడాలి

'శంబాల' థియేటర్లలోనే చూడాలని... అప్పుడే ఆ వీఎఫ్ఎక్స్, థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారని అన్నారు ఆది సాయి కుమార్. 'ఈ మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారు. 'శంబాల' స్టిల్ వదిలిన క్షణం నుంచి మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్స్ మంచి రెస్పాన్స్‌ అందుకున్నాయి. క్లైమాక్స్‌లో వచ్చే సీక్వెన్స్ అదిరిపోతుంది. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆడియెన్స్‌లో మా మూవీ పట్ల మంచి బజ్ ఏర్పడింది. ఈసారి మంచి విజయాన్ని అందుకోబోతోన్నామనే కాన్ఫిడెన్స్ ఉంది.' అని చెప్పారు.

'ఛాంపియన్' హిట్ అవ్వాలి

ఈ నెల 25నే 'ఛాంపియన్' కూడా రిలీజ్ అవుతుందని... ఆ మూవీ కూడా హిట్ కావాలని ఆది ఆకాంక్షించారు. 'క్రిస్మస్, డిసెంబర్ 25 అనేది మంచి సీజన్. శ్రీకాంత్ గారి ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఉంది. రోషన్‌తో నాకు మంచి పరిచయం ఉంది. మా క్రికెట్‌ టీంలో రోషన్ చురుకుగా ఉంటాడు. రోషన్ నటించిన 'ఛాంపియన్' సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.

'శంబాల' మ్యూజిక్.. మ్యాజిక్

''శంబాల' చిత్రంలో ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండవు. కానీ ఉన్న వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. ఆ అవుట్ పుట్ చూసి మేం అంతా సంతృప్తి చెందాం. శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. చివరి క్షణం వరకు థీమ్స్ చేస్తూనే వచ్చారు. ప్రతీ ఒక్క పాత్రకి ఆయన అద్భుతమైన థీమ్ సెట్ చేశారు. 

మూవీలో సాంగ్స్ ఎక్కువగా ఉండవు. ప్రమోషనల్ సాంగ్ అని అనుకున్నాం. కానీ మాకు అంత టైం సరిపోలేదు. అయినా ఇలాంటి జానర్ చిత్రాలకు హుక్ స్టెప్స్, సాంగ్స్ సెట్ అవ్వవేమో. కానీ ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతోంది. ఆర్ఆర్‌తో ఈ మూవీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటారు.' అని చెప్పారు.

Also Read : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - సారీ చెప్పిన శివాజీ... వివాదానికి చెక్ పడేనా!

గాయాలు కామన్

షూటింగ్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో గాయాలవుతుంటాయని... అది కామన్ అని అన్నారు ఆది. 'ఫైర్‌తో ఓ సీక్వెన్స్ ఉన్నప్పుడు చిన్నగా గాయమైంది. పోరాట సన్నివేశాల్లో గాయాలు అనేవి కామన్. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. ఈ టైటిల్ చెప్పినప్పుడే నేను చాలా ఎగ్జైటయ్యాను. స్టోరీ విన్న కొన్ని రోజులకే ‘కల్కి’ రిలీజ్ అయింది. ఆ తర్వాత శంబాల పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది.

మా చిత్రానికి మంచి బజ్ అయితే ఏర్పడింది. మా నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారు. మా ప్రమోషన్స్ అయితే ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ‘శంబాల’ లాంటి చిత్రాల్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు.' అని అన్నారు.

భారీ బడ్జెట్

తనకు పెద్దగా మూఢ నమ్మకాలు లేవని... చిన్న చిన్న వాటిని నమ్ముతానని అన్నారు ఆది. 'ఇంట్లో పాటించే సెంటిమెంట్స్‌ను మాత్రం నమ్ముతాను. డైరెక్టర్ యుగంధర్‌కి ఇది ఫస్ట్ మూవీ. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో శ్రమించారు. నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో నా మార్కెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. హిందీలోనూ మూవీని ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ముందుగా రిలీజ్ చేసి ఆ తర్వాత హిందీలో రిలీజ్ చేస్తాం. ఇక్కడ పాజిటివ్ టాక్ వచ్చిన తరువాత అక్కడ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాం.

సినిమాను దాదాపు విపరీతమైన చలిలో నైట్ షూట్ చేశాం. క్లైమాక్స్ పార్ట్ మొత్తం నైట్ షూట్‌లోనే జరిగింది. ఎంత కష్టమైనా కూడా అందరం ఇష్టంతో కలిసి పని చేశాం.' అని అన్నారు.

'శంబాల' సీక్వెల్‌పై...

ఈ చిత్రంలో అన్ని పాత్రలు బాగుంటాయని... అర్చన కారెక్టర్ తనతోనే ప్రయాణం చేస్తుంటుందని ఆది తెలిపారు. 'ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. 'శంబాల'ను ఆడియెన్స్ హిట్ చేస్తే.. పార్ట్ 2 ప్లాన్ చేస్తాం. ప్రస్తుతం ఈటీవీ విన్‌కి సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్ చేశాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తాం.' అని తెలిపారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: గురువారం (మార్చి 26) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే... ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్
గురువారం (మార్చి 26) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే... ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Pawan Kalyan : పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ - నాట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్... లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ - నాట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్... లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget