1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
కూటికి గతిలేకపోయినా.. ఆర్భాటాలకు మాత్రం పాకిస్తాన్ ఎప్పుడూ వెనక్కి తగ్గదు. అందులోనూ ఇండియాపైన ఏదైనా సక్సెస్ దొరికిందంటే మాత్రం ఇక వాళ్ల ఓవర్ యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. రీసెంట్‌గా అండర్ 19 ఆసియా కప్ 2025లో టీమిండియాపై పాక్ కుర్రాళ్ల టీం భారీ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ ఆసియా కప్ 2025లో పాక్ మెన్స్ టీమ్.. ఇండియా చేతిలో పైనల్‌తో సహా 3 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పరువు పోగొట్టుకుంది కదా. ఇప్పుడు అండర్ 19 టీమ్ ఇండియన్ టీమ్‌ని అండర్ 19 వరల్డ్ కప్‌లో ఓడించి కప్పు సాధించడంతో.. కుర్రాళ్లపై ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ కాసుల వర్షం కురిపించాడు. విజేతగా నిలిచిన పాకిస్థాన్ అండర్ 19 టీమ్‌లో ఒక్కో ఆటగాడికి.. కోటి పాక్ రుపియాలు నజరానాగా ప్రకటించాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ అండర్ 19 టీమ్ మెంటార్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. సోమవారం ఇస్లామాబాద్‌లో ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌ను పాకిస్థాన్ అండర్ 19 టీమ్‌ని కలిసిన షెహబాజ్.. వాళ్లని ఆకాశానికి ఎత్తేయడమే కాకుండా.. వాళ్లకి సత్కారాలు కూడా చేశాడు. అయితే విచిత్రం ఏంటంటే.. ఒక పాక్ రుపియా మన రూపాయిలో 32 పైసలే అన్నమాట. ఆ లెక్కన ఒక్కో ఆటగాడికి పాక్ ప్రధాని ఇచ్చింది 32 లక్షలే. దీంతో మరీ ఇంత వెరైటీగాళ్లేంట్రా? దీనికే ఇంత ఓవరాక్షనా? అంటూ ఇండియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





















