Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకి.. ముఖ్యంగా రీసెంట్‌గా అక్కడ ఓ హిందువైన దీపూ చంద్రదాస్‌ను అత్యంత భయానకంగా హింసించి, చంపి.. శవాన్ని కూడా తగలబెట్టిన విజువల్స్ బయటకు రావడంతో.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి వ్యతిరేకంగా మొదట నేపాల్‌లోని హిందూ సంఘాలు నిరసనలకు దిగితే.. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు మొదలయ్యాయి. మొదట పశ్చిమ బెంగాల్‌లో.. ఆ తర్వాత ఢిల్లీ.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో విశ్వ హిందూ పరిషత్‌తో సహా మిగిలిన హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం బయట భారీ స్థాయిలో చేరిన విశ్వ హిందూ పరిషత్, ఇతర సంఘాల కార్యకర్తలు భారీ స్థాయిలో చేరి నిరసనలకు దిగారు. 'బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే దౌత్యపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. హిందూ జాగరణ్ మంచ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల ఆధ్వర్యంలో కమిషనరేట్‌ను ముట్టడించి.. హనుమాన్ చాలీసా చదువుతూ బలవంతంగా లోపలికి వెళ్లడానికి ట్రై చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది బారికేడ్లను సైతం దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇక పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కూడా భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలకు దిగాయి హిందూ సంఘారు. రాష్ట్రంలో అక్రమంగా నివశిస్తున్న బంగ్లాదేశీయులను వెంటనే దేశం నుంచి తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. ఇక మన హైదరాబాద్‌లోని కొత్తపేటలో కూడా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనకి దిగింది. భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే, VHP తనదైన శైలిలో కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆందోళనలకు మరింత ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై కేంద్రం స్పందించి.. దౌత్య పరంగా సరైన చర్యలు తీసుకునే వరకు ఈ ఆందోళనలు కొనసాగిస్తామని హిందూ సంఘాలు చెబుతుండటంతో ఇప్పుడు అందరి చూపు కేంద్రం వైపే ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బంగ్లాదేశ్‌పై ఎలాంటి చర్యలకు దిగుతుంది? అనేది చూడాలి. అయితే మీరు చెప్పండి.. ఈ ఇష్యూలో ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఎలా ఉండాలంటారు? కామెంట్ చేసి చెప్పండి.





















