Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam
అండర్19 ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యచ్‌లో ఇండియా ఓటమి, అది కూడ పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోవడం కంటే మరో విషయం విపరీతంగా వైరల్ అవుతోంది. అదే పాకిస్తానీ బౌలర్‌కి మన అండర్ 19 జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ షూ చూపించి అవమానించాడనే ఫోటోలు, న్యూస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో వైభవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ అండర్ 19 టీమ్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అయితే తాజాగా ఇదే ఇష్యూకి సంబంధించిన మరి కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలని బట్టి చూస్తే వైభవ్‌ది తప్పు లేదనిపిస్తోంది. మ్యాచ్‌లో 10 బంతుల్లో 266 స్ట్రైక్ రేట్‌తో 26 రన్స్ చేశాక పాక్ పేసర్ అలీరజా బౌలింగ్‌లో అవుటయ్యాడు వైభవ్. అయితే అవుటైన వెంటనే అలీరజాకు షూ చూపించినట్లు మొదట రిలీజ్ అయిన ఫోటోల్లో ఉంది. కానీ తాజాగా రిలీజ్ అయిన ఫోటోల్లో వైభవ్‌ని అవుట్ చేసిన ఆనందంలో అలీ రజా.. పిచ్ మీదకు వచ్చేయడంతో.. పిచ్‌లో డేంజర్ జోన్‌ను షూతో తొక్కాడని చెప్పడానికే వైభవ్ తన షూ చూపించి సైగ చేసినట్లు అనిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమో ఇంకా క్లారిటీ రావల్సి ఉంది.





















