(Source: Poll of Polls)
Controlling Grey Hair : తెల్ల జుట్టు ఎక్కువగా వస్తోందా? కారణాలివే.. గ్రే హెయిర్‌ని దూరం చేస్తూ, జుట్టు రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
White Hair : తెల్ల జుట్టు ఎక్కువ అవుతుందా? అయితే దీనిని ఎలా కంట్రోల్ చేయాలో.. దానికి గల కారణాలు ఏంటో? నిపుణులు ఇస్తున్న సూచనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Grey Hair Prevention Tips : గ్రే హెయిర్‌ని కొందరు స్టైలిష్‌గా మార్చుకుంటారు. మరికొందరు అయ్యో అప్పుడే తెల్ల జుట్టు వచ్చేస్తుందే అని బాధపడతారు. అందరూ స్టైలిష్‌గా తమ లుక్‌ని మార్చుకోలేరు కాబట్టి తెల్ల జుట్టు రాకుండా ఉండాలనే కోరుకుంటారు. దీనిలో భాగంగా కొందరు జుట్టు రంగులు వేసి.. గ్రే హెయిర్‌ని కవర్ చేసుకుంటారు. ఇవన్నీ కాకుండా సహజంగా గ్రే హెయిర్‌ని ఎలా కంట్రోల్ చేయాలో.. వేటిని ఫాలో అయితే తెల్ల జుట్టు ఎక్కువ కాకుండా.. నల్లని జుట్టు సొంతమవుతుందో ఇప్పుడు చూసేద్దాం.
జుట్టు నల్లగా ఉండడానికి రీజన్..
జుట్టు నల్లగా ఉండడానికి కావాల్సింది మెలనిన్ పిగ్మెంట్. మెలనోసైటిక్ స్టెమ్ సెల్స్ దీనిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లలోనూ, హెయిర్ జెర్మ్లోనూ ఉంటాయి. కొన్ని జెర్మ్స్ రూట్ జెర్మ్లోకి వెళ్లి మెలనిన్గా మారి.. జుట్టుకు నలుపుదనాన్ని ఇస్తాయి. వీటి ఉత్పత్తి తగ్గినప్పుడు నల్లని జుట్టు తెల్లగా మారుతుంది. wnt/బీటా-catenin pathway, పోషకాహార లోపం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గి జుట్టు తెల్లగా మారుతుంది.
మరిన్ని కారణాలు..
కొందరికి జెనిటిక్స్ కారణం వల్ల చిన్ననాటి నుంచే తెల్లని జుట్టు వచ్చేస్తుంది. ఎక్కువమందిలో వయసుతో పాటు గ్రే హెయిర్ ప్రారంభమవుతుంది. హెయిర్ ఫాలికల్స్ వయసు పెరిగే కొద్ది మెలినిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇవి జుట్టు మెరిసేలా చేస్తాయి. ఒత్తిడిని ఎక్కువగా తీసుకునేవారికి కూడా జుట్టు తెల్లబడుతుంది.
విటమిన్ బి 12, విటమిన్ డి, కాపర్ వంటి పోషకాల లోపం వల్ల కూడా నల్లని జుట్టు దూరమవుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా గ్రే హెయిర్ త్వరగా వస్తుంది. స్మోకింగ్ చేసేవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ధూమపానం వల్ల హెయిర్ ఫాలికల్స్ నాశనమవుతాయి. ఇవి జుట్టు నలుపుదనాన్ని తగ్గించి గ్రే హెయిర్‌ని పెంచుతాయి.
హార్మోనల్ సమస్యల వల్ల, మోనోపాజ్ సమయంలో లేదా ప్రెగ్నెన్సీ సమయంలో గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టు కూడా ఎక్కువ రాలిపోతుంది. కొన్ని రకాల మెడికల్ కండీషన్స్ కూడా హెయిర్ ఫాలికల్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. హెయిర్ కేర్ ప్రోడెక్ట్స్ జుట్టును డ్యామేజ్ చేసి తెల్లని జుట్టును పెంచుతాయి.
సహజంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కొబ్బరి నూనెతో స్కాల్ప్‌ని రెగ్యులర్‌గా మసాజ్ చేయాలి. ఇది జుట్టుకు, కుదుళ్లకు పోషణను అందించి.. తెల్లని జుట్టును దూరం చేస్తుంది. ఉసిరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేసి.. జుట్టు గ్రే అవ్వడాన్ని తగ్గిస్తాయి. ఉసిరికాయలను డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా జుట్టు హెల్తీగా, బ్లాక్‌గా ఉంటుంది. బ్రింగరాజ్ ఆయిల్ కూడా మంచి ఫలితాలు ఇస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. జుట్టు పెరుగుదలకు, నల్లగా ఉండేలా హెల్ప్ చేస్తుంది.
జీవనశైలిలో చేయాల్సిన మార్పులు
ఒత్తిడిని తగ్గించుకోకుంటే జుట్టు మెరవడం తగ్గదు. కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. మెడిటేషన్, యోగా మంచి ఫలితాలు ఇస్తాయి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. విటమిన్ బి 12 ఉండే ఫుడ్ తీసుకోవాలి. విటమిన్స్, పోషకాలతో నిండిన ఆహారం పూర్తి ఆరోగ్యానికే కాదు.. జుట్టుకు మంచి ఫలితాలు ఇస్తుంది. హైడ్రేషన్ వల్ల కూడా జుట్టు హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ఫాలో అవ్వాల్సిన టిప్స్
రెగ్యులర్ ట్రిమ్స్ వల్ల జుట్టు చిట్లకుండా, బ్రేకేజ్ లేకుండా హెల్తీగా ఉంటుంది. హెయిర్ ఫాలికల్స్ హెల్తీగా ఉంటాయి. సల్ఫేట్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగిస్తే మంచిది. ఎండలోకి వెళ్లినప్పుడు జుట్టును కవర్ చేస్తే మరీ మంచిది. ఇది జుట్టు రాలకుండా గ్రే హెయిర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. వైద్యులను కలిసి అసలైన రీజన్ తీసుకుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జుట్టును రాలకుండా, గ్రే హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు.






















