అన్వేషించండి

Cab Safety Tips for Women : మహిళలు క్యాబ్, బైక్ రైడ్స్ బుక్ చేసుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్.. సేఫ్టీ ముఖ్యం గర్ల్స్

Women’s Safety Guide for Cab and Bike Ride : క్యాబ్స్ బుక్ చేసుకునేటప్పుడు అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనుకుంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • క్యాబ్ బుక్ చేశాక డ్రైవర్ ప్రొఫైల్, రేటింగ్ సరిచూసుకోండి.
  • మీ ప్రయాణ సమాచారాన్ని నమ్మకమైనవారితో తప్పక షేర్ చేయండి.
  • డ్రైవర్ సరైన మార్గంలో వెళ్తున్నాడో లేదో మ్యాప్​లో గమనించండి.
  • అత్యవసర బటన్, 112 నంబర్​ను ఉపయోగించడానికి సిద్ధంగా ఉండండి.
  • డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే వెంటనే దిగిపోండి.

Cab and Bike Ride Tips for Women : ఈ రోజుల్లో చాలామంది ప్రయాణించడానికి ఆన్‌లైన్ క్యాబ్‌లు, బైక్ రైడ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా నగరాల్లో ఉద్యోగాలకు వెళ్లేందుకు, కాలేజీకి వెళ్లేవాళ్లు కూడా వీటిని బుక్ చేసుకుంటారు. దీనికోసం ఓలా, ఉబెర్, లేదా రాపిడో వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఉపయోగిస్తారు. అలాగే ఈ సేవలు సురక్షితమైనవిగా చెప్తారు. కానీ ఇటీవలి సంఘటనలు మహిళల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తాయి. 

క్యాబ్ లేదా బైక్ రైడ్ బుక్ చేసుకునేప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాణించాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆన్‌లైన్‌లో క్యాబ్ లేదా బైక్ బుక్ చేసేటప్పుడు మహిళలు పరిగణించవలసిన ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

డ్రైవర్ ప్రొఫైల్

క్యాబ్ బుక్ చేసిన తర్వాత, ముందుగా డ్రైవర్ ప్రొఫైల్, రేటింగ్‌ను చెక్ చేసుకోవాలి. యాప్ డ్రైవర్ ఫోటో, వాహనం నంబర్, వారు పూర్తి చేసిన రైడ్‌ల గురించిన సమాచారాన్ని చూడాలి. డ్రైవర్‌కు తక్కువ రేటింగ్ ఉన్నా లేదా గతంలో ఫిర్యాదులు ఉన్నా.. ఏమాత్రం సంకోచించకుండా రైడ్‌ను క్యాన్సిల్ చేసుకోవడం ఉత్తమం. క్యాబ్ ఎక్కే ముందు, యాప్‌లో చూపిన డ్రైవరే మీ ఎదురుగా ఉన్న వ్యక్తి అని నిర్ధారించుకోండి.

షేర్ ట్రిప్

మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు.. మీకు నమ్మకమైన వారితో మీ ప్రయాణ సమాచారాన్ని తప్పకుండా పంచుకోండి. దాదాపు అన్ని క్యాబ్ యాప్‌లు 'షేర్ ట్రిప్' లేదా 'లైవ్ లొకేషన్' అనే ఎంపికను అందిస్తాయి. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీరు ఎక్కడ ఉన్నారో.. మీ క్యాబ్ ఎక్కడికి చేరిందో.. మీరు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుస్తుంది. 

మ్యాప్ ఫాలో అవ్వండి

అంతేకాకుండా క్యాబ్ లేదా బైక్ ఎక్కిన తర్వాత.. మీ ఫోన్‌లో మ్యాప్‌ను తెరిచి.. డ్రైవర్ యాప్‌లో చూపిన మార్గంలోనే వెళ్తున్నాడో లేదో నిర్ధారించుకోండి. డ్రైవర్లు తరచుగా షార్ట్‌కట్‌ల పేరుతో నిర్మానుష్యమైన రోడ్లలో వెళ్తుంటారు. డ్రైవర్ నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు వెళ్లడం మీరు గమనిస్తే.. వెంటనే అతడిని సరైన మార్గంలో వెళ్లమని చెప్పండి.

ఎమర్జెన్సీ బటన్

క్యాబ్, బైక్ బుకింగ్ యాప్‌లలో SOS అత్యవసర బటన్ ఉంటుంది. మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు.. ఈ ఫీచర్ ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణ సహాయం పొందడానికి మీ ఫోన్‌లో 112 అత్యవసర నంబర్‌ను సెట్ చేసుకోండి.

ఆపేయండి.. దిగిపోండి..

ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన అసాధారణంగా అనిపించినా లేదా మీకు అసౌకర్యంగా అనిపించినా.. మీ గమ్యస్థానానికి చేరుకునే వరకు వేచి ఉండకండి. రద్దీగా ఉండే ప్రాంతంలో, పెట్రోల్ పంపు వద్ద లేదా పోలీస్ చెక్‌పాయింట్ వద్ద ఆగి దిగడం సురక్షితమైన మార్గం. అవసరమైతే సమీపంలోని వ్యక్తుల నుంచి సహాయం కోరడానికి సంకోచించకండి. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు సేఫ్​గా గమ్యస్థానానికి చేరుకుంటారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget