పిల్లలతో విమానంలో ఎటైనా వెళ్లాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లల నిద్రకు అనువుగా ఉండే టైమింగ్స్‌ని జర్నీకోసం ఎంచుకుంటే మంచిదట. కిడ్స్ ఫ్రెండ్లీ ఎయిర్‌లైన్‌ని ఎంచుకుంటే మంచిది. పిల్లలకు ఫుడ్, డైపర్స్, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లు ఉంటాయి. డైపర్స్, వైప్స్, మిల్క్ ఫార్మూలా, స్నాక్, గేమ్స్ వంటి వాటిని ఓ బ్యాగ్‌లో ప్యాక్ చేసుకుని క్యారీ చేయండి. పిల్లలకు కంఫర్ట్‌బుల్‌గా ఉండేదుస్తులను లేయరింగ్గా వేస్తే మంచిది. ఇబ్బందులుండవు. ఎయిర్‌పోర్ట్‌కి త్వరగా రీచ్ అయ్యేలా చూసుకోండి. ప్లే ఏరియా, నర్సింగ్ రూమ్‌లో రెస్ట్ తీసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకుంటే మీ ప్రాసెస్ కాస్త త్వరగా అవుతుంది. ఎక్కువ వెతుక్కోవాల్సిన పని ఉండదు. పిల్లలు నిద్రలేచాక.. వారు ఆడుకునేందుకు బొమ్మలు, గేమ్స్ దగ్గర్లో ఉండేలా చూసుకోండి. ఎక్కువ సమయం జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు వారికి ఫుడ్, వాటర్ అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఎక్కువ సమయం జర్నీ ఉంటుందనుకుంటే మీతో పార్టనర్ ఉండేలా చూసుకోండి.