అన్వేషించండి

Ugadi Pachadi Recipe : ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవే.. ట్రెడీషనల్ రెసిపీని ఫాలో అయిపోండి

Ugadi Pachadi : ఉగాది దాదాపు అందరి ఇళ్లల్లో ఉగాది పచ్చిడి చేస్తారు. అయితే ట్రెడీషనల్ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉగాది పండుగ తెలుగువారి నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తుంది.
  • జీవితంలోని ఆరు భావాలను సూచించే ఆరు రుచులు పచ్చడిలో ఉంటాయి.
  • చింతపండు రసం, బెల్లం, మామిడి, మిర్చి, వేపపువ్వు, ఉప్పుతో పచ్చడి తయారీ.
  • ప్రాంతాలను బట్టి పచ్చడి తయారీ మారినా, ఇది సంప్రదాయ పద్ధతి.

Traditional Ugadi Pachadi Recipe : తెలుగు పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది తెలుగువారికి కొత్త సంవత్సర ఆరంభాన్ని సూచిస్తుంది. పైగా ఒక్కో ఏడాది ఒక్కోపేరుతో ఈ ఉగాదిని పిలుస్తారు. 2026లో ఉగాది సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. అందుకే ఈ పండుగ పర్వదినాన.. దాదాపు ప్రతి ఇంట్లో.. 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడిని చేసుకుంటారు. దీనిని తిన్నప్పుడు మొదటిసారి ఏ రుచి తెలుస్తుందో.. ఆ ఏడాది అలా ఉంటుందని భావిస్తారు. కానీ ఈ పచ్చడిని చాలామంది తమ రుచికి తగ్గట్లు చేసుకుంటారు. అలా కాకుండా ట్రెడీషనల్​గా ఉగాది పచ్చడిని ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ఉగాది పచ్చిడి ఎందుకు చేస్తారు?

ఉగాది రోజు ఉగాది పచ్చడి చేయడం వెనుక ఉన్న భావం చాలా లోతైనదిగా చెప్తారు. ఈ పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలోని ఆరు భావాలను సూచిస్తాయని అంటారు. తీపి ఆనందాన్ని, చేదు బాధను, పులుపు ఆశ్చర్యాన్ని, ఉప్పు లైఫ్ బ్యాలెన్స్​ను, కారం కోపాన్ని, వగరు కొత్త అనుభవాలను సూచిస్తాయి. సంతోషం, బాధ, ఆశ్చర్యం, కోపం అన్నీ కలిపేదే జీవితం అని చెప్పే గొప్ప సందేశమే ఉగాది పచ్చడి.

ఉగాది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

వేపపువ్వు – 1 టేబుల్ స్పూన్

బెల్లం – 2 టేబుల్ స్పూన్లు

చింతపండు రసం – 1 కప్పు

మామిడి ముక్కలు – ½ కప్పు

మిర్చి ముక్కలు – 1 టేబుల్ స్పూన్

ఉప్పు – తగినంత

నీరు – అవసరమైతే

తయారీ విధానం

ముందుగా చింతపండును నానబెట్టి రసం తీసుకోవాలి. బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి లేదా పొడి చేసి ఉంచాలి. ఒక గిన్నెలో చింతపండు రసం పోసి అందులో బెల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు మామిడి ముక్కలు, మిర్చి ముక్కలు లేదా కారం వేసుకోవాలి. తరువాత వేపపువ్వు, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలిపి రుచి సర్దుకోవాలి. అంతే ట్రెడీషనల్ ఉగాది పచ్చడి రెడీ. 

కొందరు ఉగాది పచ్చడిని గట్టిగా చేసుకుని తింటారు. కొన్ని ప్రాంతాల్లో లూజ్​గా చేసుకుని తాగుతారు. ప్రాంతాలను బట్టి ఇది మారినా.. ట్రెడీషనల్​గా చేసుకోవడానికి మాత్రం ఇదే కరెక్ట్ రెసిపీ. అలాగే కొందరు తమ రుచికి తగ్గట్లు ద్రాక్షలు, అరటిపండ్లు, ఇతర పదార్థాలు వేసుకుంటారు. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తారు. సీజన్ మారే సమయంలో ఈ రుచులు ఇమ్యూనిటీని పెంచుతాయని అంటారు.

Frequently Asked Questions

ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు?

ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులు జీవితంలోని ఆరు భావాలను సూచిస్తాయి. తీపి ఆనందాన్ని, చేదు బాధను, పులుపు ఆశ్చర్యాన్ని, ఉప్పు లైఫ్ బ్యాలెన్స్​ను, కారం కోపాన్ని, వగరు కొత్త అనుభవాలను సూచిస్తాయి.

సాంప్రదాయ ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి?

సాంప్రదాయ ఉగాది పచ్చడి తయారీకి వేపపువ్వు, బెల్లం, చింతపండు రసం, మామిడి ముక్కలు, మిర్చి ముక్కలు, మరియు తగినంత ఉప్పు అవసరం.

ఉగాది పచ్చడి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తారు. సీజన్ మారే సమయంలో ఈ రుచులు ఇమ్యూనిటీని పెంచుతాయని అంటారు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget