TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల, వివరాలు ఇలా
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్(TG TET)-2025 షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ తెలిపింది.

TG TET 2025 Dates: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్(TG TET)-2025 షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 11న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ తెలిపింది.
టెట్ అర్హతలకు సంబంధించి.. పేపర్-1కు డీఎడ్, పేపర్-2కు బీఎడ్ పూర్తయి ఉండాలి. వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్లకు సైతం టెట్ అర్హతను ప్రామాణికంగా నిర్ణయించడంతో.. వేలాది మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా...జనవరిలో పదోసారి నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.
ఇంటర్ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసినవారు టెట్ పేపర్-1 ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ తర్వాత బీఈడీ చేసినవారు టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత సాధించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం సెక్షన్ 23(1) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో అర్హత పొందడం తప్పనిసరి.
ఇప్పటి వరకు డీఈడీ, బీఈడీ తదితర కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. కానీ, ఎన్సీటీఈ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకూ టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)ను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జూన్, డిసెంబర్/జనవరిలో నిర్వహించేలా ప్రభుత్వం స్పెషల్ షెడ్యూల్కూడా ఖరారు చేసింది. గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది.
అర్హతలు:
➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.
➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
పరీక్ష విధానం: టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను ఓసీలకు 90గా, బీసీలకు 75గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 60గా ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

