CITD: సీఐటీడీ హైదరాబాద్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
CITD Diploma Courses: హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్ఎంఈ టూల్ రూం- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) 2025-26 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.

CITD Diploma Admissions - 2025: హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్ఎంఈ టూల్ రూం- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) 2025-26 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేసన్ విడుదల చేసింది. దీనిద్వారా 240 సీట్లను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 240 సీట్లు
* డిప్లొమా కోర్సులు
1. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 60 సీట్లు
వ్యవధి: 04 సంవత్సరాలు(8 సెమిస్టర్‌లు).
కోర్సు ఫీజు: సెమిస్టర్‌కు రూ.22,000.
అర్హత: జనరల్ అభ్యర్థులు 50% & ఎస్సీ/ఎస్టీ 45% తో 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 22.05.2025 నాటికి 15 - 19 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ): 60 సీట్లు
3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్‌ఈ): 60 సీట్లు
4. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ): 60 సీట్లు
వ్యవధి: 03 సంవత్సరాలు(6 సెమిస్టర్‌లు).
కోర్సు ఫీజు: సెమిస్టర్‌కు రూ.22,000.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 22.05.2025 నాటికి 19 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: హైదరాబాద్‌లో సీఐటీడీ(CITD) నిర్వహించిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.400.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశ పరీక్ష విధానం: పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 10వ తరగతి నుంచి మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ పై ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష సమయం: 1½ గంటలు.
వేదిక (ప్రవేశానికి మాత్రమే, మారవచ్చు):
University College of Engineering
Osmania University
Hyderabad – 500 007.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
‘The Principal Director,
CITD, Balanagar, Hyderabad - 500 037’.
అడ్మిషన్ కౌన్సెలింగ్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు..
➥ ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు
➥ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
➥ పుట్టిన తేదీ సర్టిఫికేట్
➥ బోనఫైడ్ సర్టిఫికేట్
➥ ఇంటిగ్రేటెడ్ కాస్ట్ సర్టిఫికెట్(వర్తిస్తే)
➥ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్
➥ ఆధార్ కార్డ్
➥ మూడు పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోలు (నేమ్ ట్యాగ్‌తో) అండ్ ఒక స్టాంప్ సైజు ఫోటో.
➥ ఏదైనా అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుంచి ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్.. అవసరమైతే, అభ్యర్థిని తదుపరి వైద్య పరీక్షకు పంపే హక్కు సంస్థకు ఉంది.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.05.2025.
✦ ప్రవేశ పరీక్ష తేదీ: 25.05.2025(ఆదివారం).
ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్.





















