Sreeleela: నటి శ్రీలీలకు చేదు అనుభవం - చేయి పట్టుకుని లాగిన ఆకతాయిలు.. వీడియో వైరల్
Sreeleela: ప్రముఖ నటి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఆమె హీరోతో తిరిగి వస్తుండగా గుంపు నుంచి కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించారు.

Some People Misbehaved With Actress Sreeleela In Movie Shooting: ప్రముఖ నటి శ్రీలీలకు (Sreeleela) సినిమా షూటింగ్‌లో షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. షూట్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహంతో ఆమె చేయి పట్టుకుని లాగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారి నుంచి ఆమెను విడిపించారు.
అసలేం జరిగిందంటే?
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా మారిన శ్రీలీల.. అటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'ప్రేమ కథా చిత్రం' (Prema Katha Chitram) సినిమాలో ఆమె నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. మూవీ టీం ఇటీవలే డార్జిలింగ్‌కు వెళ్లింది. ఇదే సమయంలో షూటింగ్ అయిన తర్వాత శ్రీలీల హీరో కార్తీక్ ఆర్యన్‌తో తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.
ఇదే సమయంలో కార్తీక్ అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లగా.. ఆయన వెనుకే శ్రీలీల సైతం నవ్వుకుంటూ అందరినీ పలకరించారు. చుట్టూ బాడీగార్డులు ఉన్నా.. గుంపులో నుంచి కొందరు ఆకతాయిలు శ్రీలీల చేయి పట్టుకుని లాగారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారిని విడిపించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆమెను వారి నుంచి విడిపించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె తన చేయి పట్టుకుంటూ ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీలతో వారు ప్రవర్తించిన తీరు సరికాదని.. అభిమానం హద్దులు దాటకూడదని.. అత్యుత్సాహం ప్రదర్శించకూడదని కామెంట్స్ చేస్తున్నారు. భద్రత పెంచుకోవాలంటూ నటి శ్రీలీలకు సూచిస్తున్నారు.
Evadra aa laagesadu 🤣🤣🤣🤣🤣#SreeLeela pic.twitter.com/fd8citrIhz
— Radoo (@Chandan_radoo) April 6, 2025
Also Read: 'పెద్ది' సిగ్నేచర్ షాట్ - నెటిజన్ల రియాక్షన్ ఇదే, మీమ్స్‌తో అప్పుడే మొదలుపెట్టేశారుగా..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' మార్చి 28న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 'పరాశక్తి', రవితేజతో 'మాస్ జాతర', కన్నడ తెలుగులో 'జూనియర్' అనే సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

