28 Degrees Celsius OTT Streaming: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ థ్రిల్లర్ '28 డిగ్రీస్ సెల్సియస్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
28 Degrees Celsius OTT Platform: యంగ్ హీరో నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ '28 డిగ్రీస్ సెల్సియస్'. ఇప్పడు సడన్‌గా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

Naveen Chandra's 28 Degrees Celsius OTT Streaming On Amazon Prime Video: ఇటీవల కొన్ని మూవీస్ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఓటీటీలు సైతం మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే కామెడీ, హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీస్, సిరీస్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి.
నెల లోపే కొత్త మూవీ
యంగ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా.. 'పొలిమేర' సిరీస్ చిత్రాల ఫేం డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ '28 డిగ్రీస్ సెల్సియస్'. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల లోపే సడన్‌గా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియోలో' స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మూవీలో నవీన్ చంద్ర సరసన హీరోయిన్ షాలిని (Shalini) నటించారు. వీరితో పాటే ప్రియదర్శి, వైవా హర్ష, రాజా రవీంద్ర, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషించారు. సాయి అభిషేక్ నిర్మాతగా వ్యవహరించగా.. శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.
Also Read: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి' రీ రిలీజ్ - ఎప్పుడో తెలుసా?, ఈసారి మరిన్ని రికార్డులు కన్ఫర్మ్
స్టోరీ ఏంటంటే?
కార్తీక్ (నవీన్ చంద్ర) మెడిసిన్ చదువుతున్న సమయంలోనే అంజలి (షాలిని) పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే, అనాథ అయిన కార్తీక్‌తో పెళ్లికి అంజలి పేరెంట్స్ అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకుంటుంది అంజలి. అయితే, పెళ్లి తర్వాత ఆమెకు బాడీ టెంపరేచర్‌కు సంబంధించి ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. ఆమె బాడీ టెంపరేచర్ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే టెంపరేచర్ పెరిగినా.. తగ్గినా.. కాసేపటికే చనిపోతుంది.
దీంతో ఆమెను ట్రీట్మెంట్ కోసం జార్జియా తీసుకెళ్తాడు కార్తిక్. ఇద్దరూ ఒకే హాస్పిటల్‌లో పని చేస్తూ అంజలి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే, కార్తిక్ ఓ రోజు ఇంటికి వచ్చేసరికి అనుకోకుండా అంజలి చనిపోయి ఉంటుంది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కార్తిక్ మద్యానికి బానిసవుతాడు. కానీ అంజలి ఆత్మ కార్తిక్‌ను వెంటాడుతుంది. అలా కొన్ని సంఘటనలు ఆ ఇంట్లో జరుగుతాయి. వీటిని చూసిన కార్తిక్ షాక్ అవుతాడు. అసలు అంజలి ఎలా చనిపోయింది?, అంజలి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో జరిగిన పరిణామాలేంటి?, కార్తిక్ మళ్లీ మామూలు మనిషి అవుతాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















