Thaman : 'అఖండ 2' థియేటర్లలో పేలిన బాక్సులు - సౌండ్ మిక్సింగ్ విమర్శలపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
Thaman Reaction : 'అఖండ 2' కొన్ని థియేటర్లలో బాక్సులు పేలడంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రియాక్ట్ అయ్యారు. సౌండ్ మిక్సింగ్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Thaman Reaction On Speakers Damage Negative Comments On His Sound Mixing : 'స్పీకర్స్ ముందే సర్వీస్ చేసి పెట్టుకోండి. తర్వాత బద్దలైపోయాయ్... కాలిపోయాయ్ అంటే నాకు సంబంధం లేదు.' ఇదీ బాలయ్య 'అఖండ 2' రిలీజ్‌కు ముందు మ్యూజిక్ లెజెండ్ తమన్ చెప్పిన మాట. 'అఖండ 2'లో బాలయ్య ఎనర్జీకి తమన్ ఇచ్చిన బీజీఎం వేరే లెవల్. కొన్ని థియేటర్లలో స్పీకర్స్ కాలిపోయాయి. ఈ క్రమంలో తమన్ సౌండ్ మిక్సింగ్‌పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఫేమస్ సింగర్ సునీత ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్‌పై ఆయన రియాక్ట్ అయ్యారు.
'పేలితే అన్నీ థియేటర్లలోనూ పేలాలి'
'ఈ సినిమాకు ఎన్ని థియేటర్లలో బాక్సులు బ్లాస్ట్ అయ్యాయి?' అంటూ సునీత ప్రశ్నించగా... అది తన తప్పు కాదని తమన్ అన్నారు. చాలా థియేటర్లలో 70MM స్క్రీన్స్, ప్రొజక్టర్స్ మిషన్ అప్డేట్ అయ్యాయని... కానీ స్పీకర్స్ మాత్రం పాతవే ఉంచారని తెలిపారు. 'చాలా థియేటర్లలో ఓల్డ్ స్పీకర్సే ఉన్నాయి. అది సర్వీస్ చేయడమే లేదంటే మార్చుకోవడమో చేయాలి. నా మిక్సింగ్ వల్లే బాక్సులు బద్దలు కావు.
సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్స్ ఇలా సినిమాలో ప్రతీ ఒక్క సీన్‌కు ఏ రేంజ్ వాల్యూమ్ వాడాలో అంతే వాడతా. నన్ను దాటి DOLBY అప్రూవ్డ్ ఇంజినీర్ వస్తారు. అతను అప్రూవ్ చేస్తేనే ఏ మ్యూజిక్ ట్రాక్ అయినా బయటకు వెళ్తుంది. కేవలం నా నిర్ణయంపైనే సౌండ్ అనేది ఆధారపడదు. డాల్బీ ఇంజినీర్ మొత్తం సినిమా చూసి సౌండ్ ఎలా ఉందో చెక్ చేసుకుంటారు. థియేటర్స్ మార్కింగ్స్ రాసుకుని పంపిస్తారు. ఒకవేళ బాక్సులు పేలితే అన్నీ థియేటర్లలోనూ పేలాలి. కానీ కొన్ని థియేటర్లలోనే ఎందుకు పేలుతున్నాయి? వారు సరిగ్గా సర్వీస్ చేయలేదు. 100 కిలోమీటర్లు టైర్ సరిగ్గా మెయింటెయిన్ చేస్తే కారు సరిగ్గానే వెళ్తుంది. పాత టైర్లతో తోలితే పంచరే అవుతుంది.' అంటూ క్లారిటీ ఇచ్చారు.
#SSThaman addresses the negative comments about his sound mixing
— Daily Culture (@DailyCultureYT) December 19, 2025
"పాత టైర్లు తో కార్ తోలితే puncture ఏ అవుతుంది...స్పీకర్స్ కూడా అలానే...It's not about my mixing...వాళ్ళు Proper గా Service చెయ్యాలి"#Akhanda2 pic.twitter.com/FXQdaDg1zM
Also Read : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?





















