Drinking Water Mistakes : ఆయుర్వేదం ప్రకారం నీటిని ఆ సమయంలో తీసుకోకూడదట.. లేకుంటే ఆ సమస్యలు తప్పవు
Ayurveda Water Habits : నీరు శరీరానికి మంచిదే కానీ దానిని తాగడానికి కూడా కొన్ని నియమాలున్నాయి అంటోంది ఆయుర్వేదం. ఆ సమయంలో తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవట. అవేంటంటే..

Wrong Time to Drink Water : శరీరానికి కావాల్సినంత నీటిని అందించడం లేదా రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటని తాగడం మంచిదే. నీరు తాగడం ఎంత మంచిదో.. నీటిని తాగడానికి కూడా సరైన సమయం ఉండాలంటోంది ఆయుర్వేదం. కొన్ని సమయాల్లో అయితే కచ్చితంగా నీటిని తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం నీటిని తీసుకోకూడని సయమాలు ఏంటి? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం.
భోజనానికి ముందు..
భోజనం చేసే ముందు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట వచ్చే అవకాశముందట. అలాగే తీసుకున్న ఆహారం లేట్‌గా జీర్ణమవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. ఒకవేళ మీకు నీటిని తాగాలనిపిస్తే.. గోరువెచ్చని నీటిని ఓ సిప్ తీసుకోవచ్చు. ఎక్కవగా తాగడం కంటే ఇది బెస్ట్. భోజనానికి కనీసం అరగంట ముందు నీటిని తాగవచ్చు.
భోజనం తర్వాత..
కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కడుపు హెవీగా ఉన్నప్పుడు నీటిని తీసుకోకూడదట. దీనివల్ల కూడా జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. జీర్ణ సమస్యలు పెరుగుతాయి. తీసుకున్న ఆహారం టాక్సిన్స్గా మారే అవకాశం ఉంది. మెటబాలీజం తగ్గి.. బరువు పెరుగుతారు. భోజనం చేసిన 45 నిమిషాల తర్వాత నీటిని తాగవచ్చు.
వ్యాయామ సమయంలో..
పరుగెత్తినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు చాలామంది సడెన్‌గా వచ్చి.. పెద్ద పెద్ద గుటకలు వేస్తూ నీరు తాగుతారు. ఇది అస్సలు మంచిది కాదు. దీనివల్ల వాత, కఫ సమస్యలు రావొచ్చు. నొప్పి పెరుగుతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. మీరు ఆ సమయంలో నీటిని తాగాలనుకుంటే.. రిలాక్స్‌గా కూర్చొని చిన్న మోతాదులో.. చిన్న చిన్నగా నీటిని తీసుకోవచ్చు.
ఉదయం నిద్రలేచిన వెంటనే
రాత్రి నిద్ర తర్వాత ఉదయం చాలామంది నీటిని తాగుతారు. ఇది మంచి విషయమే కానీ.. కొందరు ఎక్కువ మోతాదులో నీటిని తాగుతారు. ఇది కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుంది. కాబట్టి ఒక గ్లాసు గోరు వెచ్చని నీటితో లేదా ఇన్ఫ్యూజ్ చేసిన నీటితో డేని ప్రారంభిచవచ్చు.
చెమట ఎక్కువగా వస్తున్నప్పుడు..
సమ్మర్లో చాలామంది ఉక్కపోస్తుందని.. చెమట ఎక్కువగా ఉందని.. చల్లని నీటిని తాగుతారు. అది మంచిది కాదని చెప్తుంది ఆయుర్వేదం. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయట. కఫ సమస్యలు వస్తాయట. కాబట్టి రూమ్ టెంపరేచర్ నీటిని రిలాక్స్‌గా కూర్చొని తాగితే మంచిదట.
ఎమోషనల్‌గా ఉన్నప్పుడు..
కోపం, బాధ, భయంలో వంటి ఎమోషన్స్‌లో ఉన్నప్పుడుకూడా నీటిని తాగవద్దని చెప్తున్నారు. దీనివల్ల ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడమే కాకుండా.. జీర్ణ సమస్యలు పెరుగుతాయి. వాత సమస్యలు వస్తాయి. కాబట్టి.. ముందుగా ఎమోషన్స్‌ని అదుపులోకి తెచ్చుకుని.. డీప్ బ్రీత్ తీసుకుని రిలాక్స్ అయి.. నీటిని చిన్నగా తీసుకోవాలి.






















