Hunter 350 Vs Jawa 42: హంటర్ 350 Vs జావా 42 - మీ డబ్బుకు ఏది బెస్ట్ బైక్?
Royal Enfield Hunter 350 Vs Jawa 42: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 & జావా 42లో ఏ మోటార్ సైకిల్ మంచిది? ధర, ఫీచర్లు, పవర్, మైలేజ్ అన్ని వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

Royal Enfield Hunter 350 Vs Jawa 42: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల హంటర్ 350 కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. మన మార్కెట్లో దీనికి ప్రధాన ప్రత్యర్థి జావా 42 బైక్. రెట్రో-మోడర్న్ స్టైలింగ్‌తో సూపర్ లుక్స్ ఇచ్చే ఈ రెండు మోటార్‌సైకిళ్లు క్రూయిజర్ కేటగిరీ కిందకు వస్తాయి. మీరు ఈ రెండు బైక్‌లలో ఒకదానిని ఎంచుకోవాలనుకుంటే - రెండింటి ధర, ఫీచర్లు & పవర్‌ను పోల్చి చూడాలి.
ధర
2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షలు నుంచి స్టార్ట్ అవుతుంది, టాప్ వేరియంట్‌కు రూ. 1.75 లక్షల వరకు ఉంటుంది. జావా 42 ఎక్స్-షోరూమ్ రేటు రూ. 1.73 లక్షల నుంచి ప్రారంభమై రూ. 1.98 లక్షల వరకు ఉంటుంది. జావా 42 FJ వేరియంట్ ధర రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.20 లక్షల మధ్య ఉంటుంది. రేటు పరంగా చూస్తే, ముఖ్యంగా మీ బడ్జెట్ రూ. 1.50 లక్షలు - రూ. 2 లక్షల మధ్య ఉంటే హంటర్ 350 బెటర్ ఆప్షన్ అవుతుంది.
ఫీచర్లు & స్పెసిఫికేషన్లు
2025 హంటర్ 350లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-ఛానల్ ABS, LED టెయిల్ లాంప్ & 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను అందించారు. అదనంగా, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ ఫెసిలిటీని కూడా యాడ్ చేశారు. జావా 42 పూర్తిగా డిజిటల్ LCD డిస్‌ప్లే, LED హెడ్‌ల్యాంప్‌లు & డ్యూయల్-ఛానల్ ABS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చింది. జావా 42 FJ వేరియంట్ డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ & 18-అంగుళాల ఫ్రంట్ వీల్‌తో (17-అంగుళాల వెనుక చక్రం) స్పోర్టీ లుక్ ఇస్తుంది.
ఇంజిన్ పవర్
హంటర్ 350 బైక్ 349.34cc సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్ తో 20.4PS పవర్ & 27Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంటుంది, నగరంలోని ట్రాఫిక్ & హైవే రైడింగ్ రెండింటికీ సరిపోతుంది. జావా 42 బైక్‌లో 294.72cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు, ఇది 27.32PS పవర్ & 26.84Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మరోవైపు.. జావా 42 FJ వేరియంట్ 334cc ఇంజిన్‌తో ఉంటుంది, ఇది 29.1PS పవర్‌ను & 29.6Nm టార్క్ ఔట్‌పుట్ ఇస్తుంది. జావాలోని ఈ రెండు వేరియంట్లలో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. పవర్ & టార్క్ పరంగా జావా 42, ముఖ్యంగా FJ వెర్షన్ హంటర్ 350 కంటే శక్తిమంతమైనది.
మైలేజ్
కంపెనీ లెక్క ప్రకారం.. 2025 హంటర్ 350 వెర్షన్ బైక్ లీటరుకు దాదాపు 36 కి.మీ. మైలేజీని ఇస్తుంది, జావా 42 స్టాండర్డ్ లీటరుకు దాదాపు 33 కి.మీ. కవర్ చేస్తుంది & జావా 42 FJ లీటరుకు దాదాపు 32 కి.మీ. నడుస్తుంది. మైలేజ్ పరంగా హంటర్ 350 ముందుంటుంది, డైలీ రన్నింగ్‌కు ఇది బెస్ట్ అవుతుంది.
ఏ బైక్ కొనాలి?
బడ్జెట్ పరంగా.. జావా 42 కంటే 2025 హంటర్ 350 మోడల్ డబ్బును ఆదా చేస్తుంది. ఫీచర్ల పరంగా, హంటర్ 350 ప్రాథమిక & అవసరమైన ఫీచర్లను యాడ్ చేసుకుంది. జావా 42 ఆధునిక & అధునాతన ఫీచర్లతో లాంచ్ అయింది. పవర్ పరంగా హంటర్ 350 స్మూత్ సిటీ రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది, జావా 42 మరింత పవర్‌ను & స్పోర్టీ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. హంటర్ 350 ఈ విషయంలోనూ మెరుగ్గా పని చేస్తుంది, జావా 42 మైలేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది. బెటర్ ప్రైసింగ్‌లో మృదువైన & నమ్మదగిన బైక్‌ను కోరుకునే రైడర్‌లకు హంటర్ 350 ఒక గొప్ప ఎంపిక. మోర్ పవర్, స్పోర్టీ డిజైన్ & మోడర్న్ ఫీచర్లతో విభిన్న శైలిని కోరుకునే రైడర్లకు జావా 42, ముఖ్యంగా దాని FJ వేరియంట్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.





















