Vijayashanthi: విజయశాంతి కాళ్లకు నమస్కరించిన పృథ్వీ - నేను అక్కకు ప్రియ తమ్ముడిని అంటూ..
Arjun Son Of Vyjayanthi: కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ విజయశాంతి కాళ్లకు నమస్కరించారు.

Vijayashanthi About Prithveeraj: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ (Kalyanram), సీనియర్ నటి విజయశాంతి (Vijayashanthi) తల్లీకొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun S/O Vyjayanthi). ఈ నెల 18న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర బృందం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా 'ముచ్చటగా బంధాలే' అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న విజయశాంతి చిత్ర బృందాన్ని పరిచయం చేశారు.
విజయశాంతి కాళ్లకు పృథ్వీ నమస్కారం
ఈ సినిమాలో సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithiveeraj) కీలక పాత్ర పోషించారు. విజయశాంతి అందరినీ పరిచయం చేస్తుండగా.. బబ్లూ పృథ్వీరాజ్‌ను కూడా పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా పృథ్వీ విజయశాంతి కాళ్లకు నమస్కరించారు. 'మీరు నా చిన్న తమ్ముడు' అని విజయశాంతి అనగా.. 'నేను ఈ అక్కకు ప్రియమైన తమ్ముడిని' అంటూ పృథ్వీ బదులిచ్చారు. దీంతో ఆడియన్స్ ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెగ సెర్చ్ చేస్తోన్న నెటిజన్లు
దీంతో వీరిద్దరూ ఏయే సినిమాల్లో ఎప్పుడు నటించారా? అనే విషయాలను నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. 1997లో వచ్చిన 'పెళ్లి' సినిమాతో పృథ్వీ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు దేవుళ్లు సినిమాలో తన నటనతో తెలుగు ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేశారు. తమిళం, మలయాళం ఇలా దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. 1999లో శరత్ కుమార్, విజయశాంతి కీలక పాత్రల్లో రూపొందిన 'రాజస్థాన్' సినిమాలో పృథ్వీ నటించారు. ఆ తర్వాత 'వైజయంతి' సినిమాలో విజయశాంతి సోదరునిగా నటించారు.
Also Read: మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్? - సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తారా?
కెరీర్‌లోనే బెస్ట్ రోల్
తన కెరీర్‌లోనే బెస్ట్, కష్టమైన రోల్ ఏదైనా ఉంది అంటే అది 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమానే అని పృథ్వీ అన్నారు. 'సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టాలు చూశాను. 'యానిమల్' సినిమా తర్వాత నా జీవితం మారింది. 'రాజస్థాన్' సినిమాలో నేను విజయశాంతి గారి తమ్ముడిగా చేశాను. ఏదైనా ఓ సీన్ సరిగ్గా రాలేదంటే అది ఎన్నిసార్లైనా చేసేందుకు విజయశాంతి వెనుకాడరు.' అని పృథ్వీ అన్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ 'నాయాల్ది' రిలీజ్ కాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా తల్లీకొడుకుల అనుబంధాన్ని తెలిపే 'ముచ్చటగా బంధాలే' సాంగ్ సైతం ఆకట్టుకుంటోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరగనుండగా.. టాలీవుడ్ స్టార్, కల్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
A MASSIVE EVENING with the MAN OF MASSES 🔥@tarak9999 Garu will grace the '𝐀𝐑𝐉𝐔𝐍 𝐒/𝐎 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈' PRE-RELEASE EVENT on 12th April ❤🔥
— NTR Arts (@NTRArtsOfficial) April 11, 2025
GRAND RELEASE WORLDWIDE ON APRIL 18th, 2025.#ArjunSonOfVyjayanthi@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar… pic.twitter.com/VjJHFjvElo
ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి కనిపించనున్నారు. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు. ప్రదీప్ చిలుకూరి సినిమాకు దర్శకత్వం వహించగా.. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.





















