KL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP Desam
లక్నో సూపర్ జెయింట్స్ పై అశుతోష్ శర్మ ఊతకొట్టుడుతో అద్భుత విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ దాన్ని ఫుల్టూ ఎంజాయ్ చేసింది. దీనికి రెండు రీజన్స్ ఒకటి స్టార్టింగ్ లో చేసుకోవాల్సిన నైట్ పార్టీ పోస్ట్ పోన్ అవ్వటం ఒక రీజన్ అయితే..కేఎల్ రాహుల్ కి పాప పుట్టడం రెండో రీజన్. సో మ్యాచ్ గెలిచిన ఆనందం..కేఎల్ రాహుల్ కు పాప పుట్టిన సంబరం అన్నీ కలిపి ఢిల్లీ క్యాపిటల్స్ నైట్ పార్టీ లో కుర్రోళ్లంతా ఫుల్ వైబ్ అయ్యారు. ర్యాంప్ వాక్ లు..ఫన్నీ ఇమిటేషన్స్ తో మంచి జోష్ చూపించారు. కోచ్ కెవిన్ పీటర్సన్ తన ఐడియా ఏంటో షేర్ చేసుకున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ స్పిన్నర్స్ లో ఒకడైన అక్షర్ పటేల్ కెప్టెన్సీలో మనం ఆడుతున్నామని..మనకున్న భయాలు ఆందోళనలు పక్కన పెట్టేసి ఎదురు ఎవ్వడున్నా భయం లేని క్రికెట్ ఆఢదామని పీటర్సన్ మంచి ధైర్యమిచ్చారు ఆటగాళ్లలో. ఇక ఆ తర్వాత సరదా ఈవెంట్స్ జరిగాయి. జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ మునాఫ్ పటేల్ ను ఇమిటేట్ చేస్తే...కేఎల్ రాహుల్ కోచ్ పీటర్సన్ ను ఆటపట్టించాడు. సో అసలే స్ట్రాంగ్ గా ఉన్న ఢిల్లీ కేఎల్ రాహుల్ రాకతో మరింత స్ట్రాంగ్ గా మారింది. సో నెక్ట్స్ మ్యాచ్ లో అతిపెద్ద టాస్క్ వాళ్లకు 30వ తారీఖు సన్ రైజర్స్ తో మ్యాచ్ ఉంది చూడాలి మరి ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ ఎలా ఉండనుందో.





















