Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Telangana CM: కక్ష కట్టి ఉంటే కేసీఆర్ ఫ్యామిలీ చర్లపల్లి జైల్లో ఉండేదని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తనతో ఎలా వ్యవహరించారో రేవంత్ గుర్తు చేసుకుని అసెంబ్లీలో భావోద్వేగానికి గురయ్యారు.

Revanth Reddy: తాను కక్ష సాధించి ఉంటే కేసీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండేదని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడారు. ఆ సమయంలో కక్ష పూరిత పాలన చేస్తున్నారని ఇది రేవంత్ కే మంచిది కాదని అన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..కక్ష పూరిత పాలన చేస్తే ఎలా ఉండేదో వివరించారు. కక్ష సాధింపునకు పాల్పడితే మీరు చంచల్‌గూడలో ఉండేవారన్నారు. ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైలుకు పంపారు.. 16 రోజులు డిటెన్షన్ సెల్‌లో ఎవర్నీ కలవకుండా నిర్బంధించారు.. జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని గుర్తు చేసుకున్నారు.
బిడ్డ లగ్గానికి కూడా బెయిల్ రాకుండా చేశారు - అది కక్ష సాధింపు కాదా ?
నా బిడ్డ లగ్గం ఉన్న బెయిల్ కూడా రావద్దు అని కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ నుండి లాయర్లను పిలిపించి కేసు ను వాదించారని రేవంత్ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. డ్రోన్ కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తారని.. ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తారన్నారు. కానీ ఆ రోజు వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని తనను జైలుకు పంపారన్నారు. దేవుడు అన్ని చూస్తాడు అని వేచి చూశానన్నారు. నేను ప్రమాణస్వీకారం చేసిన రోజే వాళ్లు ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఈ రోజు వరకు కూడా అక్రమ కేసులు పెట్టలేదు.. పార్టీ ఆఫీసులో సొంత కూలీలతో పచ్చి బూతులు మాట్లాడించినా కక్ష సాధింపునకు పాల్పడలేదు.. ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారు కాదన్నారు.
రూ.500 ఫైన్ వేసే కేసులో 16 రోజులు డిటెన్షన్ సెంటర్ లో పెట్టారు -అది కక్ష సాధింపు కాదా ?
రాజకీయ కక్ష సాధింపులంటే మీవేనని కేటీఆర్ పై రేవంత్ విరుచుకుపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించానన్నారు సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా సంయమనం పాటించానన్నారు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నన్ను అక్రమంగా చర్లపల్లి జైల్లో నక్సలైట్లు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల మధ్య ఉంచారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ కోపాన్ని దిగమింగుకొని పని చేస్తున్నాను.
మేము అలా కక్ష కట్టి ఉంటే మీరు ఇక్కడ ఉండేవారా?
తాము అధికారంలోకి వస్తే చర్లపల్లి జైల్లో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చానని దాన్ని కూడా నెరవేర్చలేదని రేవంత్ చెప్పారు. తీసి లోపలెయ్ అంటున్నారుఎక్కడికెళ్లినా నన్ను అడుగుతున్నారు . ఇంకెన్ని రోజులన్నా తీసి లోపలెయ్.. అంటున్నారని.. అందుకే కదా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది అని అంటున్నారు. అయినా నేను కక్ష సాధింపు చర్యలకు పోలేదన్నారు. కిరాయి మనుషులతో బూతులు మాట్లాడించినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు.. చెంపలు పగలగొట్టేంత శక్త ఉన్న సంయమనంతో ఊరుకున్నానన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

