IPL 2025 Riyan Parag Comments: 20వ ఓవర్ అందుకే సందీప్ కు ఇచ్చా.. మా గెలుపునకు కారణమదే.. రాయల్స్ కెప్టెన్ పరాగ్
చెన్నై, రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరి దశలో పైచేయి సాధించిన రాయల్స్ స్టన్నింగ్ విక్టరీ సాధించింది. దీంతో ఈ సీజన్ లో తొలి గెలుపు తన ఖాతాలో వేసుకుంది.

CSK VS RR Updates: మాజీ చాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఇక కీలక సమయాల్లో కెప్టెన్ రియాన్ పరాగ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. ముఖ్యంగా ఆఖరి ఓవర్ ను సందీప్ శర్మకు ఇవ్వడం కూడా సానుకూలంగా మారింది. అప్పటికే ఫైర్ మీదున్న జోఫ్రా ఆర్చర్ ను కాదని సందీప్ కు బంతినిచ్చి ఒక రకంగా గ్యాంబుల్ చేశాడు. అయితే ఆ ఓవర్లో విజయానికి 20 పరుగులు అవసరం కావల్సి ఉండగా, చెన్నై కేవలం 13 పరుగులు మాత్రమే సాధించడంతో పరాజయం పాలైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత దీనిపై పరాగ్ స్పందించాడు. జట్టులోని ఆ అనుకూలత వల్లే తాను కీలక సమయాల్లో విభిన్న నిర్ణయాలు తీసుకునేందుకు ఉపకరించిందని పేర్కొన్నాడు.
A pure 𝐑𝐎𝐘𝐀𝐋ty knock! 👑
— IndianPremierLeague (@IPL) March 30, 2025
Nitish Rana wins the Player of the Match award for his match-winning innings that powered #RR to their first win of #TATAIPL 2025 🩷
Scorecard ▶️ https://t.co/V2QijpWpGO#RRvCSK | @rajasthanroyals | @NitishRana_27 pic.twitter.com/riiRnElkP7
సందీప్ కే ఎందుకంటే..
ఆదివారం మ్యాచ్ లో ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లతో రాజస్థాన్ బరిలోకి దిగింది. దీంతో చివరి ఓవర్ వేసేందుకు ఆర్చర్, సందీప్ ఉండగా, గతాన్ని దృష్టిలో పెట్టుకుని సందీప్ కే బంతిని పరాగ్ అందించాడు. 2023లో ఇదే రకమైన పొజిషన్ అంటే చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, అప్పుడు కూడా సందీపే బౌలింగ్ చేశాడు. యాదృశ్చికంగా ధోనీ కూడా అప్పుడు బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్ లో 20 పరుగులను డిఫెండ్ చేసుకుని, రాయల్స్ కు సందీప్ విజయాన్ని అందించాడు. అందుకే సందీప్ కే తన ఓటు వేసినట్లు తెలుస్తోంది.
అద్భుతమైన ఫీల్డింగ్..
ఈ మ్యాచ్ లో తమ జట్టు అద్భుతమైన ఫీల్డింగ్ కూడా విజయంలో కీలకపాత్ర పోషించిందని పరాగ్ తెలిపాడు. మంచి క్యాచ్ లు, ఫీల్డింగ్ వల్ల పైచేయి సాధించామని, గత రెండు మ్యాచ్ ల్లో ఓటమిని మర్చిపోయి, ఈ మ్యాచ్ లో విజయం కోసమే బరిలోకి దిగామని పేర్కొన్నాడు. ఇక తన కెప్టెన్సీలో తొలి విజయం సాధించడం ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (81) సత్తా చాటాడు. బౌలర్లలో నూర్ అహ్మద్, మతీషా పతిరాణకు రెండేసి వికెట్లు దక్కాయి.ఇక ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన చెన్నై 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (63)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వనిందు హసరంగా 4 వికెట్లతో చెన్నైని వణికించాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కి వరుసగా రెండో ఓటమి ఎదురైంది.




















