అన్వేషించండి

IPL 2025 Points Table: పాయింట్స్ టేబుల్‌లో ఐపీఎల్ నెగ్గని టీమ్స్ టాప్, ఫస్ట్ ఎవరంటే

IPL 2025 Points Table RR vs CSK | పాయింట్స్ టేబుల్‌లో ఐపీఎల్ నెగ్గని టీమ్స్ టాప్ 5లో నాలుగు టీమ్స్ ఉన్నాయి. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

హైదరాబాద్: గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో IPL 2025లో జరిగిన 11వ మ్యాచ్‌లో ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓటమిపాలైంది. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తొలి విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని CSK జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి చెందడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

విశాఖపట్నంలో ఆదివారం (మార్చి 30న) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో SRH తమ తొలి మ్యాచ్‌లో నెగ్గింది. ఆపై వరుస రెండు మ్యాచ్‌లలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. 

ఆదివారం మ్యాచ్‌ల తరువాత చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. 4 పాయింట్లు 2.266 రన్‌రేటుతో ఆర్సీబీ టాప్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గినా 1.32 రన్ రేటుతో రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. టాప్ 5 జట్లలో ఐపీఎల్ నెగ్గిన జట్టు గుజరాత్ మాత్రమే ఉంది.

  టీమ్ మ్యాచ్‌లు గెలుపు ఓటమి టై పాయింట్లు రన్ రేట్
1 Royal Challengers Bengaluru 2 2 0 0 4 2.266
2 Delhi Capitals 2 2 0 0 4 1.32
3 Lucknow Super Giants 2 1 1 0 2 0.963
4 Gujarat Titans 2 1 1 0 2 0.625
5 Punjab Kings 1 1 0 0 2 0.55
6 Kolkata Knight Riders 2 1 1 0 2 -0.308
7 Chennai Super Kings 3 1 2 0 2 -0.771
8 Sunrisers Hyderabad 3 1 2 0 2 -0.871
9 Rajasthan Royals 3 1 2 0 2 -1.112
10 Mumbai Indians 2 0 2 0 0 -1.163

- మూడు ఐపీఎల్ ట్రోపీలు నెగ్గిన కోల్ కతా జట్టు 2 మ్యాచ్ లలో ఒకటి నెగ్గి, ఒకటి ఓడింది. -0.308 రన్ రేటు ఉన్నా 6వ స్థానంలో నిలిచింది.
- 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్ లలో ఒకటి నెగ్గి, రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. -0.771 రన్ రేటుతో 7వ స్థానంలో నిలిచింది.
- ఒక ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్ లలో ఒకటి నెగ్గగా, రెండు మ్యాచ్ లలో ఓడింది. -0.871 రన్ రేటుతో 8వ స్థానంలో ఉంది.
- తొలి ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్ లాడి ఒకదాంట్లో నెగ్గి, రెండింట్లో ఓడిపోయింది. -1.112 రన్ రేటుతో 9వ స్థానానికి పడిపోయింది.
- 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. -1.163 రన్ రేటుతో అట్టడుగున నిలిచింది.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
Vijay Deverakonda: కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
Vijay Deverakonda: కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
Balochistan War: పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
IPL 2025 KKR VS PBKS Match Abandoned: పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్, ప్ర‌భ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్, ప్ర‌భ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
AR Rahman: ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టారు... రెండు కోట్లు డిపాజిట్ చేయండి... ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టారు... రెండు కోట్లు డిపాజిట్ చేయండి... ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
Shubman Gill : మూడేళ్లుగా నేను సింగిల్‌, ఆ వ్యక్తి కోసం ఆలుపరాటా తిన్నా: డేటింగ్ రూమర్స్‌పై శుభ్‌మన్‌ గిల్‌
మూడేళ్లుగా నేను సింగిల్‌, ఆ వ్యక్తి కోసం ఆలుపరాటా తిన్నా: డేటింగ్ రూమర్స్‌పై శుభ్‌మన్‌ గిల్‌
Embed widget