Hyderabad Vijayawada Toll Fees: హైదరాబాద్, విజయవాడ మార్గంలో టోల్ ఛార్జీలు తగ్గింపు, అర్ధరాత్రి నుంచి అమల్లోకి
Vijayawada Hyderabad national highway | హైదరాబాద్, విజయవాడ మార్గంలో టోల్ ఛార్జీలు దిగొచ్చాయి. ఎన్‌హెచ్ఏఐ నిర్ణయం నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.

NHAI reduces toll fees on Hyderabad Vijayawada national highway | హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే పై ప్రయాణించే వారికి శుభవార్త. ఈ జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు టోల్ చార్జీలు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. ఎన్ హెచ్ ఏ ఐ సవరించిన టోల్ చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే మార్చి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత వాహనదారుల నుంచి తగ్గిన చార్జీలు వసూలు చేయనున్నారు. 2026 మార్చి 31వ తేదీ వరకు తగ్గిన టోల్ చార్జీలు అమల్లో ఉంటాయి.
మొత్తం మూడు టోల్ ప్లాజాలు..
విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65 మీద తెలంగాణలో చౌటుప్పల్ మండలం లో పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలంలో కొర్లపహాడ్ టోల్ ప్లాజా, ఆంధ్రప్రదేశ్లో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వ్యాను, జీపు, కార్లకు ఒకవైపు జర్నీకి 15 రూపాయలు, రెండు వైపులా జర్నీకి 30 రూపాయలు తగ్గించారు. తేలికపాటి కమర్షియల్ వాహనాలకు ఒకవైపు జర్నీకి 25 రూపాయలు, రెండు వైపులా జర్నీకి 40 రూపాయలు.. ట్రక్కులు బస్సులకు ఒకవైపు జర్నీకి 50 రూపాయలు, రెండువైపుల జర్నీకి అయితే 75 రూపాయల వరకు NHAI తగ్గించింది.
ఏపీలోని చిల్లకల్లు నందిగామ టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు ఒకవైపు జర్నీకి ఐ5 రూపాయలు రెండు వైపులా జర్నీ అయితే 10 రూపాయల చొప్పున తగ్గించారు. 24 గంటల లోపు వాహనదారులు తెలుగు ప్రయాణం చేసినట్లయితే టోల్ చార్జీలు 25 శాతం రాయితీ లభిస్తుంది.
టోల్ చార్జీలు తగ్గడానికి కారణం ఇదే..
జిఎంఆర్ సంస్థ 1740 కోట్లతో బి ఓ టి పద్ధతిలో యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని నందిగామ వరకు 181 కిలోమీటర్లను నాలుగు లైన్ల రహదారిని నిర్మించింది. 2012 డిసెంబర్లో హైదరాబాద్ విజయవాడ రహదారిపై టోల్ ప్లాజా ల వద్ద చార్జీల వసూళ్లు ప్రారంభమయ్యాయి. గతేడా అది జూన్ 31 వరకు జిఎంఆర్ సంస్థ రహదారి నిర్వహణను టోల్ చార్జీలను పర్యవేక్షించింది. 2024 జూలై ఒకటో తేదీ నుంచి ఎన్ హెచ్ ఏ ఐ ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేస్తోంది. గతంలో ఒప్పందం ప్రకారం జిఎంఆర్ సంస్థ ప్రతి ఏడాది టోల్ చార్జీలు పెంచేది. ప్రస్తుతం ఎన్ హెచ్ ఎ ఐ టోల్ చార్జీలను కలెక్ట్ చేస్తున్నందున వాహనదారులపై భారాన్ని తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
| వాహనాల రకం | పంతంగి టోల్ ప్లాజా | పంతంగి టోల్ ప్లాజా | కొర్లపహాడ్ | కొర్లపహాడ్ టోల్ ప్లాజా | చిల్లకల్లు టోల్ ప్లాజా | చిల్లకల్లు టోల్ ప్లాజా |
| ఒకవైపు | 2 వైపుల | ఒకవైపు | 2 వైపుల | ఒకవైపు | 2 వైపుల | |
| కారు, జీపు, వ్యాన్లు | 80 | 115 | 120 | 180 | 105 | 155 |
| మినీ బస్సు, లైట్ కమర్షియల్ వాహనం | 125 | 190 | 195 | 295 | 165 | 250 |
| బస్సు, ట్రక్కులు (2 యాక్సిల్) | 265 | 395 | 410 | 615 | 350 | 520 |
| కమర్షియల్ వాహనాలు (3 యాక్సిల్) | 290 | 435 | 450 | 675 | 380 | 570 |
నిత్యం రద్దీగా ఉండే మార్గాలు కావడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో వాహనాలు నడిపేవారు, ప్రయాణించేవారు ఎన్‌హెచ్ఏఐ నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు.






















