అన్వేషించండి

Kolikapudi Srinivas: కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?

TDP: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయలేకపోతున్నానని ఆయనంటున్నారు.

TDP MLA Kolikapudi Srinivas:  తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. తిరువూరు నియోజకవర్గంలో రమేష్ రెడ్డి అనే నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశానన్నారు. పది రోజుల కిందటే ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. రమేష్ రెడ్డి బాధితులు కొంత మంది కొలికపూడి శ్రీనివాస్ ను కలిసి..తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మాటలు విన్న కొలికపూడి శ్రీనివాస్..రమేష్ రెడ్డి వ్యవహారంపై తాను హైకమాండ్ కు పది రోజుల కిందటే ఫిర్యాదు చేశానన్నారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. బాధితుల కష్టాలు తీర్చలేకపోతే తనకు ఈ పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు.    

టీడీపీ హైకమాండ్‌కు 48 గంటల డెడ్ లైన్ 
 
తెలుగుదేశం పార్టీ పెద్దలకు కొలికపూడి శ్రీనివాస్  48 గంటల డెడ్ లైన్ పెట్టారు. ఈ లోపు చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తాన్నారు.  తిరువూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట లాంటిది. టీడీపీ గెలిచి చాలా కాలం అయింది. అక్కడ ఉన్న వర్గ పోరాటం ఇతర కారణాల వల్ల పార్టీ ఓడిపోతూ వచ్చింది. అందుకే ఈ సారి అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన  కొలికపూడికి.. పెద్దగా సంబంధం లేకపోయినా టిక్కెట్ ఇచ్చారు. అనూహ్యంగా విజయం సాధించారు. దాన్ని నిలబెట్టుకుని  అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిన ఆయన..  అందరికీ దూరమవుతున్నారు.   

పలు వివాదాల్లో కొలికపూడి శ్రీనివాస్              

ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. రెండు సార్లు ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమయింది. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని పరిష్కరించుకుంటానని చెప్పి ఎలాగోలా పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్ గా ఉండటం లేదు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు ఇతర ముఖ్య నేతల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో కొలికపూడి శ్రీనివాస్ అందర్నీ కలుపుకుని వెళ్లి నియోజకవర్గంలో కీలక నేతగా ఉండాల్సిన ఆయన..  ఇతర పార్టీ క్యాడర్ తో  గొడవలు పెట్టుకోవడంతో దూరమవుతున్నారు.    

తిరువూరులో చాలా కాలం తర్వాత గెలిచిన టీడీపీ                                 

సాధారణంగా నియోజకవర్గాల్లో ఉండే ఆధిపత్య పోరు కారణంగా వచ్చే సమస్యలను ఎమ్మెల్యేలు తమకు తాము పరిష్కరించుకుంటారు. అయితే కొలికపూడి నేరుగా రాజకీయాల నుంచి ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయన .. సమస్యల్ని పెద్దవి చేసుకుంటున్నారు. అన్నీ పార్టీ పెద్దలకు చేరేలా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు పార్టీ పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తగ్గడం లేదన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది. పార్టీ గ్రామ స్థాయి నాయకులతో సమస్య వస్తే..  పార్టీ హైకమాండ్ కు డెడ్ లైన్ పెట్టేంత పిచ్చి పని ఎ ఏమ్మెల్యే చేయరని.. అదే ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని టీడీపీ నేతలు అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

BPCL Investment In AP: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.1.27 లక్షల కోట్ల రిఫైనరీకి బీపీసీఎల్ బోర్డు గ్రీన్‌సిగ్నల్!
ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.1.27 లక్షల కోట్ల రిఫైనరీకి బీపీసీఎల్ బోర్డు గ్రీన్‌సిగ్నల్!
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
CM Chandrababu: వచ్చే ఏడాది పోలవరం పూర్తి, మూడోసారి పుష్కరాలు నిర్వహించే భాగ్యం దక్కింది: సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది పోలవరం పూర్తి, మూడోసారి పుష్కరాలు నిర్వహించే భాగ్యం దక్కింది: సీఎం చంద్రబాబు
Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget