ఐపీఎల్లో ఓపెనర్‌గా దూకుడుగా ఆడే డికాక్ గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కూడా నమ్మకాన్ని కోల్పోయిన టైంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇచ్చిన అవకాశాన్ని డికాక్ వదులుకోలేదు. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వింటేజ్ డికాక్‌ను చూపించాడు.