అన్వేషించండి

Sardar 2 Movie: 'సర్దార్ 2'లో కార్తీ ఫస్ట్ లుక్ అదుర్స్ - విలన్ ఎవరో తెలుసా?, కాన్సెప్ట్ చూస్తే భయపడాల్సిందేనా!

Sardar 2 First Look: తమిళ స్టార్ హీరో కార్తీ, పీఎస్ మిత్రన్ కాంబోలో సర్దార్ 2 రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి కార్తీ ఫస్ట్ లుక్‌తో పాటు ప్రొలాగ్ వీడియోను టీం తాజాగా రిలీజ్ చేసింది.

Karthi First Look From 'Sardar 2' Movie Unveiled: కోలీవుడ్ స్టార్ కార్తీ (Karthi) హీరోగా 'సర్దార్' మూవీకి సీక్వెల్ 'సర్దార్ 2' (Sardar 2) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్‌తో పాటు ప్రొలాగ్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన 'సర్దార్' మూవీ.. తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో సర్దార్ 2పై భారీ హైప్ నెలకొంది.

సీక్రెట్ ఏజెంట్‌గా

ఈ సినిమాలోనూ కార్తీ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు ప్రోలాగ్ వీడియో బట్టి అర్థమవుతోంది. సర్దార్‌పై దాడి చేసేందుకు కొందరు వస్తుండగా.. వారు చెప్పే హింట్ ఆధారంగా దేశం ప్రమాదంలో ఉందని సర్దార్ తెలుసుకుంటాడు. 'బ్లాక్ డాగ్గర్' దేశంలో ప్రళయం సృష్టించేందుకు వస్తున్నాడని చెప్పడం ఆసక్తిని పెంచింది. 'యుద్ధం మనపైకి వచ్చినప్పుడు జీవితాలతో పోరాడేందుకు మేం సిద్ధం' అంటూ కార్తీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఎస్‌జే సూర్య నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. దేశాన్ని నాశనం చేసేందుకు అతను ఏ మిషన్ చేపట్టాడు..? దాన్ని హీరో కార్తీ సీక్రెట్ ఏజెంట్‌గా ఎలా కనిపెట్టి దేశాన్ని కాపాడాడు.? అనేదే కథాంశంగా మూవీ రూపొందినట్లు తెలుస్తోంది.

Also Read: 'శోభనం' గదిలో వధువు ఊహించని ట్విస్ట్ - సమంత నిర్మించిన 'శుభం' మూవీ టీజర్ చూశారా?

'సర్దార్' చిత్రాన్ని రూపొందించిన పీఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే 'సర్దార్ 2' సైతం తెరకెక్కుతుండగా.. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించనున్నారు. 'సర్దార్' చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ డ్యూయెల్ రోల్ చేశారు. రాశీఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. చుంకీ పాండే, లైలా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ పార్ట్‌లో దేశద్రోహిగా ముద్రపడిన ఏజెంట్ సర్దార్ చంద్రబోస్, ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్ కలిసి ఓ మిషన్ పూర్తి చేయడంతో కథ ముగుస్తుంది.

దీనికి సీక్వెల్‌గా రూపొందిన 'సర్దార్ 2'లోనూ ఆయన సీక్రెట్ ఏజెంట్‌గానే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రకాష్ (కార్తీ) ను పోలీస్ ఫోర్స్ నుంచి తొలగించిన తర్వాత, RAW ఏజెన్సీలో స్పై ఏజెంట్‌‌గా చేరాలని ఆఫర్ వస్తుంది. దీనికి అతను అంగీకరించడంతో కంబోడియాలో ఫస్ట్ మిషన్ కోసం రెడీగా ఉండాలంటూ పై అధికారి ఆదేశించడం ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. దీంతో ఈ సినిమా స్టోరీ కంబోడియా నేపథ్యంలో జరగనుందని అర్థమవుతోంది. తాజాగా వీడియోలోనూ మరో మిషన్ ప్రారంభిస్తారనే హింట్ ఇచ్చారు. మళ్లీ ఏజెంట్‌గా  సర్దార్ ఎలాంటి మిషన్ చేపట్టనున్నారో అని ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా.. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

'కాన్సెప్ట్ చూస్తే భయపడాల్సిందే'

'సర్దార్ 2' కాన్సెప్ట్ చూస్తే ఆడియన్స్ భయపడతారని నటుడు కార్తీ అన్నారు. 'సర్దార్ విడుదలయ్యాక చాలామంది వాటర్ బాటిల్స్‌లో నీళ్లు తాగేందుకు భయపడ్డారు. ఈ సినిమా స్ట్రాంగ్‌ మెసేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్ట్ 2 కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డా. ఇది ప్రేక్షకులను మరింత భయపెడుతుంది. భారీ బడ్జెట్‌తో మూవీ రూపొందిస్తున్నాం. ఇందులో ఎస్‌జె సూర్య భాగం కావడం ఆనందంగా ఉంది.' అని కార్తీ తెలిపారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget