Malaika Arora: క్రికెటర్ తో జంటగా ఐపీఎల్ మ్యాచ్ చూసిన మలైకా అరోరా... డేటింగ్ లో ఉన్నారా ?
Malaika Arora : మలైకా అరోరా కొత్త బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉందనే రూమర్లు విన్పిస్తున్నాయి. తాజాగా ఆమె ఐపీఎల్ 2025లో కుమార్ సంగక్కరతో కలిసి మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది

CSK vs RR IPL 2025 : బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా ఏం చేసినా సంచలనమే.ఆమె ఫ్యాషన్ సెన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫిట్నెస్, పర్సనల్ లైఫ్ దాకా ప్రతి ఒక్కటీ చర్చనీయాంశమే. అర్జున్ కపూర్ తో విడిపోయిన తర్వాత మలైకా త్వరగానే మూవ్ ఆన్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ క్రికెటర్ సంగక్కరతో కలిసి క్రికెట్ స్టేడియంలో దర్శనం ఇవ్వడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, డేటింగ్ లో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సంగక్కరతో కలిసి ఐపీఎల్ మ్యాచ్
అర్జున్ కపూర్ తో బ్రేకప్ తరువాత మలైకా బుల్లితెర షోలు, ఇతర ఈవెంట్ లతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె రెమో డిసౌజాతో కలిసి 'హిప్ హాప్ ఇండియా 2' అనే డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం జరిగిన IPL 2025 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను లైవ్ లో చూడటానికి ఆమె స్టేడియంకు వెళ్ళింది. అక్కడ ఆమె ఒక్కతే లేదా ఎవరైనా ఫ్రెండ్స్ తో కలిసి కన్పిస్తే ఇదేమంత పెద్ద వార్త అయ్యేది కాదేమో. కానీ ఆమె శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ మాజీ కోచ్ కుమార్ సంగక్కరతో కలిసి మ్యాచ్ ను ఆస్వాదిస్తూ కన్పించింది.
మ్యాచ్ టైమ్ లో మలైకా అరోరా రాజస్థాన్ రాయల్స్ టీ-షర్టు కూడా ధరించింది. ఆమె కుమార్ సంగక్కరతో కలిసి రాజస్థాన్ కు సపోర్ట్ చేసింది. క్రికెట్ లవర్స్ తెరపై సంగక్కరతో ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఒక్కసారిగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మలైకా, సంగక్కర ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Malaika Arora in the rr dugout
— Bhargav (@Bhargav76605307) March 30, 2025
Watching csk vs rr❤️#CSKvsRR pic.twitter.com/im9ZweL9tI
రాజస్థాన్ రాయల్స్ మాజీ కోచ్ కుమార్ సంగక్కర
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఇక కుమార్ సంగక్కర చాలా ఐపీఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ గా పని చేశాడు. ఆయన ఇప్పుడు క్రికెట్ డైరెక్టర్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. IPL 2025 కి ముందు రాహుల్ ద్రవిడ్ జట్టు కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. కుమార్ సంగక్కర పంజాబ్ కింగ్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ లకు కెప్టెన్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా మలైకా కొన్ని రోజుల క్రితమే బీచ్ లో ఓ సీక్రెట్ వ్యక్తితో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? అన్న వివరాలను మాత్రం బయట పెట్టలేదు. దీంతో ఆమె అభిమానులు ఆ వ్యక్తి సంగక్కర అయితే కాదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

