Chiranjeevi - Anil Ravipudi Movie: చిరంజీవి సినిమాలో విక్టరీ వెంకటేష్ ఇంపార్టెంట్ రోల్... హీరో క్యారెక్టర్ అదేనా?
Venkatesh In Chiranjeevi Movie: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించిన ఉన్నారని ఫిలిం నగర్ లేటెస్ట్ ఖబర్.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా కంటిన్యూగా బ్లాక్ బస్టర్ సినిమాలు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది.
చిరు సినిమాలో వెంకీ కీలక పాత్ర?
చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికల రూపొందుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ (Venkatesh)ను సంప్రదించినట్టు యూనిట్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. చిరు, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అటు దర్శకుడు అనిల్ రావిపూడితోనూ విక్టరీకి మంచి అనుబంధం ఉంది. మరి, వెంకటేష్ ఓకే అంటారా? లేదా? అనేది చూడాలి.
సినిమాలో హీరో క్యారెక్టర్ అదేనా? ఏజెంట్!?
సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. తన సినిమాలో హీరో పేరు శివ శంకర్ వరప్రసాద్ అని అనిల్ రావిపూడి కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. చిరంజీవి అసలు పేరు అదే. అయితే శివ శంకర్ వరప్రసాద్ ఏం చేస్తాడు అనేది ఈ రోజు బయటకు వచ్చింది. అనిల్ రావిపూడి సినిమాలో హీరో రా ఏజెంట్ అని యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కమాండో చీఫ్ కింద కనిపిస్తారనేది మరొక టాక్.
అనిల్ రావిపూడి లాస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'లో హీరో క్యారెక్టర్ గుర్తు ఉందా? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ చేశారు వెంకటేష్. అయితే ప్రొఫెషన్ నుంచి తప్పుకొని ఫ్యామిలీతో సెటిల్ అయిన వ్యక్తిగా కనిపించారు. ఇప్పుడు చిరును రా ఏజెంట్ కింద చూపించబోతున్నారు. మరి ఆ రా ఏజెంట్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మధ్య స్పెషల్ సీన్స్ ఏమైనా ప్లాన్ చేశారేమో చూడాలి.
Also Read: 'రాబిన్‌హుడ్'కు మైండ్ బ్లాక్ అయ్యే ఓపెనింగ్... నితిన్ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు ఏంటి?
ఉగాదికి పూజతో సినిమా ప్రారంభం!
ఉగాదికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి రామానాయుడు స్టూడియో వేదిక అయింది. చిరు వెంకటేష్ సహా ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ భామ పరిణితి చోప్రాను సంప్రదిస్తున్నట్టు తాజాగా ప్రచారం జరిగింది. దానికి ముందు అదితీ రావు హైదరితో పాటు ఐశ్వర్య రాజేష్ పేరు కూడా వినిపించింది. చివరికి ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. అందులో ఒక పాట కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలిసింది. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని మెగాస్టార్ భావిస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసిన అనిల్ రావిపూడి వేసవి ఎండలు ముగిసిన తర్వాత చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఉగాది రోజున సినిమా ప్రారంభమైన తరువాత మరిన్ని విశేషాలు వెల్లడించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

