అన్వేషించండి

Akshaya Tritiya 2025 Date : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనే ప్రచారం నిజమేనా? ఈ రోజు తప్పనిసరిగా బంగారం  కొనుగోలు చేయాలా? వాస్తవం ఏంటో తెలుసా?

Akshaya Tritiya 2025 : అక్షయ తృతీత 2025 లో ఏప్రిల్ 30న వచ్చింది...

అక్షయ తృతీత రోజు బంగారం కొనాల్సిందేనా?

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరిగిపోతుందా?

అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోతే ఏమవుతుంది?

పురాణాల్లో ఏముంది ... ?

బంగారం కొనాలన్న ప్రచారంలో నిజమెంత?
 
హిందువులకు ప్రతి పండుగా ప్రత్యేకమే. అయితే కొన్ని పండుగలు భక్తితో ముడిపడి ఉంటే మరికొన్ని పండుగలు సెంటిమెంట్స్ చుట్టూ తిరుగుతాయ్. ఇంకొన్ని పండుగలు భారీ ఖర్చుతో ముడిపడి ఉంటాయ్. అలాంటి పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ.

ఏటా వైశాఖమాసం ప్రారంభమైన మూడోరోజు వచ్చే తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజు బంగారం షాపులన్నీ వెలిగిపోతుంటాయ్. పోటీపడి ప్రకటించే ఆఫర్లు ఓ వైపు... కొంచెమైనా బంగారం కొనాలనే జనం మరోవైపు...దుకాణాలన్నీ జాతరను తలపిస్తాయి.  

అక్షయ తృతీయ అసలు ఉద్దేశం ఏంటో తెలుసా?

అక్షయం అంటే నాశనం లేనిది ఎప్పటికీ తరగనిది అని అర్థం. అక్షయం అంటే తరగని బంగారం అనే పూనకంతో పోటీపడి కొనేస్తున్నారు. ఈ రోజు బంగారం కొనేస్తే అక్షయం అయిపోతుందనుకుంటున్నారు. కానీ ఈరోజు బంగారం కొంటే పెరగదు.. బంగారం దానం చేస్తే అక్షయం అవుతుంది. పుణ్య కార్యాలు చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. 

కలిపురుషుడు నివాసం ఉండే 5 స్థానాల్లో బంగారం ఒకటి
 
పుత్తడిని అహంకారానికి హేతువుగా చెబుతారు.. అందుకే అక్షయ తృతీయ రోజు కలిపురుషుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు, అహంకారం మరింత పెచ్చుకున్నట్టు అవుతుంది.  అందుకే ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం కాదు దానం చేయడం ముఖ్యం

బంగారం దానం చేసే స్తోమత అందరకీ ఉండదు కదా..అందుకే ఈ రోజు ఆహారం, వస్త్రాలు దానం చేస్తే దానివల్ల వచ్చే పుణ్యం అక్షయం అవుతుందని పండితులు చెబుతారు. వైశాఖమాసం ప్రారంభం కాబట్టి ఎండలు మండిపోయే సమయం. ఈరోజు కుండలో నీళ్లు పోసి దానం ఇవ్వాలి. పానకం, మజ్జిక, పండ్లు దానం చేయడం మరీ మంచిది. 
 
బంగారమే కొనద్దంటే...శుభ ముహూర్తం ఏంటి?

బంగారం కొనేందుకు శుభముహూర్తం అంటూ మరో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అక్షయ తృతీయ మొత్తం మంచిరోజే. ఈ రోజు దుర్ముహుర్తం, వర్జ్యం, రాహుకాలం లాంటివి పనిచేయవు. రోజంతా అమృత ఘడియలతో సమానమే. అందుకే ఈ రోజు ఏం ప్రారంభించినా మంచే జరుగుతంది.  

మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలనే మాట ఎక్కడి నుంచి వచ్చింది?

ఇది కేవలం వ్యాపారం పెంచుకునే ట్రిక్ మాత్రమే. ఆ మాటలో పడి బంగారం కొనేయాల్సిందే అంటూ అప్పులు చేసి మరీ ఎగబడుతున్నారు.

బంగారం అనేది ఓ మంచి పెట్టుబడి, భవిష్యత్ కి భరోసా...చేతిలో డబ్బులున్నప్పుడు ఎప్పుడు కొనుగోలు చేసినా మంచిదే . అంతేకానీ అక్షయ తృతీయ రోజు కొంటే రెట్టింపు అవుతుందనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు.  

గమనిక:పండితులు చెప్పిన విషయాల ఆధారంగా రాసిన కథనం ఇది. అనవసర ప్రచారాల్లో చిక్కుకుని సెంటిమెంట్ పేరుతో ఓ పిచ్చిలో కొట్టుకుపోయే వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా సేకరించి అందించిన వివరాలు ఇవి. ఏపీపీ దేశం దీన్ని ధృవీకరించడం లేదు. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flights Cancelled: నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
GHMC: మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
AK47 Movie - Venkatesh & Trivikram: 'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
Year Ender 2025: బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flights Cancelled: నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
GHMC: మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
AK47 Movie - Venkatesh & Trivikram: 'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
Year Ender 2025: బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Embed widget