Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
Gold and Silver Price Update: బంగారం ధరలు తగ్గుతాయనే ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 2025 to మార్చి 2026 వరకూ ఏ నెలలో పెరుగుతుంది? ఏ నెలలో తగ్గుతుందో?ఇక్కడ తెలుసుకోండి...

Gold and Silver Price Update from April 2025 to March 2026 : ఈ మధ్యకాలంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఈ మధ్య స్వల్పంగా తగ్గుతున్నాయ్. ఇంకా ఇంకా తగ్గుతాయనే ప్రచారం బాగా జరుగుతోంది. ఎంత తగ్గినా సంతోషమే...ఎంత పెరిగినా కొనడమూ మానరు. అయితే తగ్గింది కాస్త ధర అయినా కొనుగోలు దారులకు ఉపశమనం కలిగిస్తుంది. వెండి కూడా అంతే..స్వల్పంగా తగ్గింది. అయితే ఈ ధరలు ఇంకా తగ్గుతాయి అంటున్నారు. ఏ నెలలో బంగారం ధరలు ఎలా ఉంటాయి? పంచాంగ కర్తలు ఏం చెబుతున్నారు?
ఏప్రిల్ 2025 (చైత్రమాసం)
చైత్రమాసం ఉంటే ఉగాది నుంచి ప్రారంభం.. ఈనెల ఆరంభంలో పెరిగిన బంగారం స్వల్పంగా తగ్గుముఖం పడుతుంది. నెల చివరి నాటికి మళ్లీ స్వల్పంగా పెరుగుతుంది
మే 2025 (వైశాఖమాసం)
వైశాఖ మాసంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. తగ్గినట్టే తగ్గుతుంది మళ్లీ పెరుగుతుంది. ఆ మార్పులన్నీ స్వల్పంగానే ఉంటాయి. పెరిగిన ధర కన్నా తగ్గిన ధరే ఎక్కువ ఉండే అవకాశం ఉంది
జూన్ 2025 (జ్యేష్టమాసం)
జూన్ నెలలోనూ బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తూ స్వల్పంగా తగ్గుతూ ఆశపెడుతుంది. బంగారం, వెండిధరలు ఒడిదుడుకులుగా నుండును.
జూలై 2025 (ఆషాఢమాసం)
జూలైన నెలలో బంగారం వెండి ధరలు మళ్లీ పెరుగుతాయి. ఈ నెలంతా పుత్తడిరేట్లలో పెరుగుదలే రానీ తగ్గుదల ఉండకపోవచ్చు
ఆగష్టు 2025 (శ్రావణమాసం)
శ్రావణమాసం అంటే ఇంకేముంది.. వెండి,బంగారానికి మంచి డిమాండ్. ఈ నెలలోబంగారం, వెండి సహా లోహాల ధరలన్నీ పెరుగుదాయి.
సెప్టెంబర్ 2025 (భాద్రపదమాసం)
ఈ నెలలో మొదటి రెండు వారాలు బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పడతాయి. చివరి రెండు వారాలు మళ్లీ పెరుగుతాయి.
అక్టోబర్ 2025 ( ఆశ్వయుజమాసం)
ఆశ్వయుజ మాసం అయిన అక్టోబరులో బంగారం, వెండి సహా లోహాల ధరలు స్వల్పంగా పెరుగుతాయి.
నవంబర్ 2025 (కార్తీకమాసం)
నవంబర్ నెల ఆరంభంలో పుత్తడి, వెండి రేట్లు స్వల్పంగా తగ్గుతాయి. కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో ధరల్లో పెరుగుదల ఉంటుంది
డిసెంబర్ 2025 ( మార్గశిరమాసం)
2025 ఆఖర్లో పసిడి, వెండి ధరలు పరుగులు పెడతాయి. ఈ నెలలో ధరలు బాగా పెరుగుతాయి
జనవరి 2026 ( పుష్యమాసం)
ఆంగ్ల నూతన సంవత్సరం జనవరిలో బంగారం ధరల్లో పెరుగుదల ఉంటుంది. వెండి ధరలు కూడా స్పల్పంగా పెరుగుతాయి
ఫిబ్రవరి 2026 (మాఘమాసం)
2026 ఫిబ్రవరి నెలలో మొదటివారం తగ్గనున్న బంగారం ధరలు ఆ తర్వాత స్వల్పంగా పెరుగుతాయి
మార్చి 2026 (ఫాల్గుణమాసం)
తెలుగు నూతన సంవత్సాది ముందు బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయి.
ఓవరాల్ గా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకూ... నాలుగు నెలల్లో మినహా మిగిలిన 8నెలల్లోనూ బంగారం ధరల్లో పెరుగుదలే కనిపిస్తోంది.
గమనిక: గ్రహాల సంచారం ఆధారంగా పండితులు పేర్కొన్న వివరాలివి. ఏబీపీ దేశం వీటిని ధృవీకరించడం లేదు.ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకునేముందు నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం..
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఉగాది 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ రాశి ఫలితం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















