Trump Tariff: చైనాకు మళ్లీ షాక్ ఇచ్చిన అమెరికా- 245 శాతం వరకు టారిఫ్ పెంపు
Trump Tariff:అమెరికా-చైనా మధ్య టారిఫ్ యుద్ధం తీవ్రమవుతోంది. చైనా ప్రత్యుత్తరాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా టారిఫ్‌ను 145% నుంచి 245%కి పెంచింది.

Trump Tariff: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, చైనా మధ్య జరుగుతున్న టారిఫ్ యుద్దం మరో మలుపు తిరిగింది. మిగతా ప్రపంచ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులపై టారిఫ్ విధించడాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు చైనాపై మాత్రం టారిఫ్స్ పెంచుకుంటూ పోతున్నారు. అటు చైనా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య టారిఫ్స్ వార్ తీవ్ర స్థాయికి చేరింది.
చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 245 శాతం టారిఫ్ విధించబోతున్నట్టు అమెరికా తాజాగా ప్రకటించింది. వైట్ హౌస్ కూడా దీనికి ఓకే చెప్పింది. దీంతో ఇప్పుడు రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. మంగళవారం సాయంత్రం వైట్ హౌస్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో ''స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమెరికా కంటే ఎక్కువ పన్నులు వసూలు చేసే అన్ని దేశాలపై అమెరికా 10 శాతం టారిఫ్ విధించింది. 75 కంటే ఎక్కువ దేశాలు కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు చేయడానికి అమెరికాతో సంప్రదించాయి, కాబట్టి వాటిపై విధించిన టారిఫ్‌లను ప్రస్తుతానికి నిలిపివేశాయి. చైనా మినహా మాత్రం మొండికేస్తోంది. ప్రతి చర్యలకు దిగుతోంది. అందుకే వీటి కారణంగా అమెరికాలో చైనీస్ వస్తువుల దిగుమతిపై 245 శాతం టారిఫ్ విధించబోతున్నాం'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.





















