అన్వేషించండి

Trump Tariffs: యాపిల్​, శాంసంగ్​కు ఊరట.. సుంకాల నుంచి వాటికి మినహాయింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం టారిఫ్​ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ప్రతీకార సుంకాల నుంచి మినహాయించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం టారిఫ్​ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ప్రతీకార  సుంకాల నుంచి మినహాయించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో యాపిల్‌, శాంసంగ్‌, డెల్ వంటి బడా కంపెనీలతో పాటు అమెరికాలోని వినియోగదారులకూ ఊరట లభించినట్లయ్యింది.

ట్రంప్​ నిర్ణయాన్ని అగ్రశ్రేణి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారు చేసే దిగ్గజాలతోపాటు ఆపిల్ శామ్‌సంగ్ లాంటి సంస్థలు స్వాగతిస్తున్నాయి. వార్తా సంస్థ AFP ప్రకారం.. చైనా నుంచి యూఎస్​లోకి ప్రవేశించే స్మార్ట్‌ఫోన్లు, వాటి విడి భాగాలు సహా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ విభాగంలోకి వస్తాయి. ఇవి ప్రస్తుతం 145 శాతం అదనపు సుంకానికి లోబడి ఉన్నాయి.

అసంబద్ధంగా భావించే పద్ధతులను పరిష్కరించేందుకు తాము ‘ప్రతీకార సుంకాల’ను ప్రవేశపెట్టినట్లు అమెరికా పేర్కొంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. చైనా మినహా మిగిలిన దేశాలపై వేసిన సుంకాలను ఇటీవల ట్రంప్‌ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చైనాపై మాత్రం 145 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఘాటుగా స్పందించిన చైనా.. తమ దేశం కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకం వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన యాపిల్‌ వంటి సంస్థలు చైనాలో ఐఫోన్లు, ఇతర యాపిల్‌ ప్రొడక్టులను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. 

ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌ వంటివి ఉన్నాయి. చైనాపై విధించిన 145 శాతం సుంకం వీటికి వర్తించదు. వీటికి వేర్వేరు సుంకాలు వర్తిస్తాయని కస్టమ్స్‌ విభాగం పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే వాటిని మినహాయిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. 


ట్రంప్‌ చర్యల కారణంగా అమెరికాలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. దీంతో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కొనుగోలుకు స్థానికంగా ఎగబడిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రతీకార సుంకాలతో అత్యధికంగా నష్టపోయింది యాపిల్​ కంపెనీనే. తాజా నిర్ణయంతో ఆ కంపెనీకి కాస్త ఊరట లభించినట్లయ్యింది.

టాప్ హెడ్ లైన్స్

Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
Prithviraj Sukumaran : వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
Breaking News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
India vs Afghanistan Test Highlights: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
Embed widget