Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి తనకు నచ్చిన వాళ్లతో మాట్లాడించాలంటూ ముంబైలో హల్ చల్ చేసిన ఓ కిడ్నాపర్ కథను ముంబై పోలీసులు ముగించారు. ముంబైలో పోవాయ్ ఏరియాలో ఓ స్టూడియోలో పనిచేస్తున్న రోహిత్ ఆర్య అనే వ్యక్తి....స్టూడియోలో ఆడిషన్ కి వచ్చిన 17మంది పిల్లలను బంధించాడు. తన సెల్ ఫోన్ లో ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి తనేం ఉగ్రవాది కాదని...కొంతమంది మాట్లాడి వాళ్ల నుంచి సమాధానాలు తెలుసుకోవాలని ఉందంటూ పోలీసులకు వీడియో పంపాడు. స్టూడియోలో బందీ అయిన పిల్లలను గాజు తలుపులును గట్టిగా కొడుతూ కేకలు వేయటంతో స్థానికులు కూడా సమాచారాన్ని పోలీసులకు చెప్పారు. పిల్లలను వదిలిపెట్టాలని అతని డిమాండ్ లను వింటామని పోలీసులు చెప్పినా కిడ్నాపర్ రోహిత్ ఆర్య మాట వినలేదు. దీంతో స్టూడియోను చుట్టుముట్టిన పోలీసులను కంగారు పడిన రోహిత్ ఆర్య తన దగ్గరున్న ఎయిర్ గన్ తో పోలీసులపై కాల్పులు జరపగా...ఆత్మరక్షణ కోసం ప్రతిగా కాల్పులు జరిపిన పోలీసులు రోహిత్ ఆర్యను హతమార్చారు. పిల్లలను ఆ చెర నుంచి విడిపించి వాళ్ల తల్లితండ్రులకు అప్పగించారు. నిందితుడి మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కు తరలించారు. నిందితుడు రోహిత్ ఆర్య మానసిక స్థితి సరిగ్గా లేదని అందుకే ఇలా పిల్లలను కిడ్నాప్ చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.





















