Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
Jemimah Rodrigues… ఇండియన్ విమెన్ క్రికెట్‌లో చాలా కాలం గుర్తుండిపోయే పేరు.. ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ సెమీస్‌లో అద్భుతైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టేసింది.

Jemima Rodrigues Innings in IND VS AUS: అసలే ఆస్ట్రేలియా.. ఆ పై మూడొందల ముప్పై…! అంత చేజ్ చేయాలంటే అది వరల్డ్ రికార్డు.. అది జరిగడం కష్టంలే అని చాలా మంది ఆశలు వదులుకున్నారు. స్మృతి మంధాన, షెఫాలీ అవుట్ అయ్యాక టీవీలు కూడా కట్టేసినోళ్లున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అద్భుతమైన Knock ఆడింది. Jemimah Rodrigues. నవీ ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో జెమీమా ఆడిన ఇన్సింగ్స్ భారత మహిళా క్రికెట్‌లో One of the best గా నిలిచిపోతుంది.
జెమీమా ధమాక
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తన సత్తా చూపించింది జెమీమా.. రెండు సార్లు వరల్డ్ కప్ అవకాశాన్ని మనకు దూరం చేసిన ఆస్ట్రేలియా.. మరోసారి ఆ ప్రయత్నం చేయనీయకుండా భారత బ్యాటర్ జెమీమా అడ్డుకుంది. 127 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఆస్ట్రేలియాను ఆపేసింది. ఏడుసార్లు చాంఫియన్‌గా నిలిచి… టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న కంగారూ విమెన్‌కు జెమీమా చుక్కలు చూపించంది.
ఆఖరి నిమిషంలో ఆర్డర్ మార్చినా…
ఈ వరల్డ్ కప్‌లో కొన్ని కీలక మ్యాచ్‌లలో గెలుపు ముంగిట భారత్ ఓడిపోయింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాపై 330కి పైగా పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. కీలకమైన సెమీ ఫైనల్‌లో కూడా ఆస్ట్రేలియా 330కి పైగా టార్గెట్ ఇచ్చింది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఎప్పుడూ 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే జెమీమాను వన్‌డౌన్‌ను మార్చింది. అది కూడా ఆఖరి నిమిషంలో ఆమెకు చెప్పారు. తాను బ్యాటింగ్‌కు రావడానికి కేవలం ఐదు నిమిషాల ముందే Jemimah ప్యాడ్ అప్ అయింది. ఆర్డర్ మార్చినప్పుటికీ తను ఏమాత్రం తొణకలేదు. అప్పటికే ఇద్దరు కీలకమైన స్టార్ ఆటగాళ్లు అవుట్ అయిపోవడంతో చాలా పొందికగా ఆడింది. అనవసర షాట్‌లకు వెళ్లకుండా.. స్కోర్‌ను రొటేట్ చేస్తూ వచ్చింది. కెప్టెన్ హార్మన్‌తో కలిసి అద్భుతమైన 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీళ్లిద్దరూ రన్ రేట్ ఎక్కడా 6కు తగ్గకుండా చూసుకున్నారు. “మ్యాచ్‌లో ఏ స్థానంలో వస్తన్నామని కాదు.. నేను ఏదో నిరూపించుకోవాలనుకోలేదు.. మ్యాచ్ గెలవడం ఒక్కటే టార్గెట్ “ అనుకుని ఆడాను అని మ్యాచ్ అనంతరం తాను వ్యాఖ్యానించింది.
సెంచరీ చేసినా సెలబ్రేషన్ లేదు
నిజానికి జెమీమా కెరీర్ ఆన్ ఆఫ్ అవుతూ వస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో కొద్దిగా ఫామ్ చూపించినప్పటికీ కొంతకాలంగా తనకు గొప్ప ఇన్నింగ్స్‌లు లేవు.. ఈ సిరీస్‌లో కూడా చాలా ఒత్తిడిలో ఉంది. అలాంటిది ఆస్ట్రేలియా లాంటి జట్టుపై అద్భుతమైన సెంచరీ సాధించినా జెమీమా సెలబ్రేట్ చేయలేదు. దీనిని బట్టే తను ఎంత పరిణితితో ఆడిందో చెప్పొచ్చు.. అసలు ఈ మ్యాచ్‌లో తను ఆడిన షాట్లు.. వాడిన గ్యాప్‌లు చూస్తేనే ఎంత తెలివిగా ఆడిందో కూడా తెలుస్తుంది. చివరి వరకూ మ్యాచ్ గెలవడం కోసం మాత్రమే చూసింది. మ్యాచ్ గెలిచిన తర్వాతనే రియాక్ట్ అయింది. అమన్.. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే జెమీమా తీవ్ర భావోద్వేగానికి గూరైంది. దాదాపు కష్టమే అనుకున్న వరల్డ్ రికార్డ్ చేజింగ్‌ను ఇండియా చేయడంలో రోడ్రిగ్‌ది కీలకపాత్ర ఇండియాకు ఇప్పుడు తనో షైనింగ్ స్టార్.

ఇండియన్ క్రికెట్ డ్రీమ్స్
పదేళ్ల వయసులో 2011 వరల్డ్ కప్‌ను Men in Blue తీసుకోవడం నేరుగా చూసిన జెమీమా.. అప్పుడే క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంది. తన ఇల్లు సచిన్ ఇంటి దగ్గర్లోనే.. వరల్డ్ కప్ ఫైనల్‌ను చూసింది. ఆ తర్వాత ఆరేళ్లకు 2017లో విమెన్ వరల్డ్ కప్ రన్నర్స్ గా నిలిచిన మన మ్‌కు వెల్కమ్ చెప్పడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు.. తాను కూడా వరల్డ్ కప్ తీసుకోవాలని డిసైడ్ అయింది. మరి నవంబర్ 2న సౌతాఫ్రికాతో జరిగే విమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌లో జెమీమా కల నెరవేరాలని కోరుకుందాం.. అది తన కలే కాదు.. ఇండియన్ విమెన్ టీమ్ ప్రపంచకప్ తీసుకోవాలన్నది కోట్లాది మంది భారతీయుల కల కూడా..!




















