Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
అన్నా.. ఆగు.. బాబాయ్ ఆగిపో.. అని చుట్టూ ఉన్న జనాలు వారిస్తున్నా, లారీ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకోవాలంటూ అరుస్తున్నా.. పట్టించుకోకుండా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి లారీతో దూసుకొచ్చిన డ్రైవర్.. వెహికల్‌తో సహా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన దుర్ఘటన ఖమ్మం జిల్లా ఏనుకూరులో జరిగింది. మొంథా తుపాను ధాటికి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాల ఉద్ధృతి కనిపించింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలా ఏనుకూరులో పొంగుతున్న వాగులోకి మధ్యలోకి దూసుకెళ్లిన లారీ ఇలా చిక్కుకుపోయింది. వాగు మధ్యలో ఆగిపోయిన లారీ నెమ్మదిగా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోవడం.. కనీసం లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలంటూ జనాలు అరుస్తున్నా కూడా లారీ నడుపుతున్న ఆ డ్రైవర్ అస్సలు ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా..కనీసం దూకేయకుండా లారీతో సహా కొట్టుకుపోవడం మొత్తం అక్కడున్న జనాలు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.





















