అన్వేషించండి

CM Chandrababu: నల్లమల సాగర్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు - సముద్రంలోకి పోయే నీటినే వాడుకుంటాం - చంద్రబాబు కీలక ప్రకటన

Water disputes : నల్లమల సాగర్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో సాగునీటి రంగంపై కీలక ప్రకటనలు చేశారు.

Chandrababu Naidu spoke in Assembly on projects and water disputes :  రాష్ట్ర భవిష్యత్తు నీటి లభ్యతపైనే ఆధారపడి ఉందని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను జల సమృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, ఈ వృధాను అరికట్టి రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

నదుల అనుసంధానం - ప్రాజెక్టుల పునరుద్ధరణ 

వంశధార నుండి పెన్నా వరకు రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా వివాదాస్పదం అవుతున్న పోలవరం-నల్లమల సాగర్  లింక్ ప్రాజెక్టుపై ఆయన కీలక వివరణ ఇచ్చారు. వృధాగా పోయే నీటినే తాము వాడుకుంటున్నామని, దీనివల్ల పొరుగు రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదని, పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు లాభమే కలుగుతుందని ఉద్ఘాటించారు. గంగా-కావేరీ అనుసంధానం తన చిరకాల స్వప్నమని, ఆ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.       

గత ప్రభుత్వ వైఫల్యాలు - భవిష్యత్తు కార్యాచరణ 

గత ఐదేళ్లలో సాగునీటి రంగం తీవ్ర విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడం మానవ తప్పిదమేనని, వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేశారని విమర్శించారు. అయితే, ఆ వైఫల్యాలను సరిదిద్ది, వచ్చే ఏడాది జూలై నాటికి వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించి, దశలవారీగా పనులు పూర్తి చేస్తామని, చింతలపూడి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి ఏలూరు, కృష్ణా జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.     

భూగర్భ జలాలే నిధులు - ప్రజా భాగస్వామ్యం 

సాంకేతికతను జోడించి భూగర్భ జలాలను పెంపొందించడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున 7 మీటర్ల లోతులోనే నీరు లభ్యమవుతోందని, దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గి రూ. 91 కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు. నీటి నిర్వహణ బాధ్యతలను మళ్ళీ నీటి వినియోగదారుల సంఘాలకే అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా, తెలుగు తల్లికి  జలహారతి ఇచ్చేలా ఒక పక్కా బ్లూ ప్రింట్‌తో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
 

టాప్ హెడ్ లైన్స్

Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget