Donald Trump Tariff War: టారిఫ్‌లపై డోనాల్డ్ ట్రంప్ బిగ్ స్టేట్మెంట్- ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు
Donald Trump Tariff War: చైనా నుంచి వచ్చే స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై పరస్పర టారిఫ్‌లను అమెరికా మినహాయించింది.

Donald Trump Tariff War: సుంకాల యుద్ధం ద్వారా ప్రపంచంలో సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ట్రంప్ సుంకాల నుంచి మినహాయించింది. ఇది అనేక ప్రసిద్ధ హై టెక్నాలజీ ఉత్పత్తులపై అమెరికన్ వినియోగదారుల ఖర్చు తగ్గుతుంది.
శుక్రవారం ఆలస్యంగా US కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ జారీ చేసిన నోటీసులో కీలక అంశాలు వెల్లడించింది. అమెరికా మినహాయించిన లిస్ట్‌లో చైనా నుంచి USకు వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు, వాటి భాగాలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం 145 శాతం అదనపు సుంకానికి లోబడి ఉన్నాయి. సెమీకండక్టర్‌లను చాలా US వాణిజ్య భాగస్వాములపై విధించిన బేస్‌లైన్ 10 శాతం సుంకం, చైనాపై విధించిన 125 శాతం అదనపు సుంకం నుంచి కూడా మినహాయించారు.
అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమెరికా దిగుమతి
ఈ మినహాయింపులు ఈ నెల ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన 10 శాతం సుంకాల పరిధిని, చైనా నుంచి వచ్చే వస్తువులపై అదనపు పనిష్మెంట్ పన్నులను తగ్గిస్తాయి. మినహాయింపు పొందిన అనేక వస్తువులు సాధారణంగా USలో తయారుకావు. వీటిలో హార్డ్ డ్రైవ్‌లు, కంప్యూటర్ ప్రాసెసర్‌లు ఉన్నాయి.
WTO సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు
మరోవైపు, WTO గూడ్స్ ట్రేడ్ కౌన్సిల్ మొదటి వార్షిక సమావేశం రెండో రోజున 'టారిఫ్స్' అనే అంశాన్ని అమెరికా చర్చింది. 'పరస్పర సుంకం' అమలు చేయాలనే తన వాదనను సమర్థించుకుంది. దీనికి చైనా ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో, 'పరస్పర సుంకం' అని పిలిచే దానిపై చైనా తన వైఖరిని స్పష్టంగా చెప్పిందని చైనా ప్రతినిధి చెప్పారు.
ట్రంప్ సుంకాలపై చైనా నిరసన
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టివేసిన అమెరికా వాణిజ్య చర్యలను ఏకపక్షంగా పెంచడం పట్ల చైనా తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తోంది. అమెరికా ప్రతిరోజూ సృష్టించే ఆశ్చర్యకరమైన, గందరగోళం అన్ని దేశాల వ్యాపారాలపై ప్రభావం పడుతుందని వాదించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థిరమైన వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ భద్రత దుర్వినియోగాన్ని చైనా గట్టిగా వ్యతిరేకించింది.





















