Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల 182 రోజుల వయసులో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. దాంతో లేటు వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇన్నేళ్ల తన వన్డే క్రికెట్ కేరీర్ లో మొదటి స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. గాడ్ ఆఫ్ క్రికెట్ గా చెప్పుకునే సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించాడు హిట్ మ్యాన్.
రోహిత్ సాధించిన ఈ రికార్డుతో ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. టీ20, టెస్ట్ మ్యాచ్ కు వెంటవెంటనే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్... తన ఫిట్ నెస్ పై ఎప్పటి నుంచి తీవ్ర స్థాయిలో ట్రోల్ల్స్ ఎదుర్కున్నాడు. కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించకుండా... తన గేమ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. కానీ గత రెండు నెలలో రోహిత్ శర్మ ట్రాన్స్ఫర్మేషన్ విమర్శకుల నోర్లను కూడా మూయించింది. తాను ఎంత ఫిట్ గా ఉన్నాడో చెప్పడానికి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నే ఉదారణగా తీసుకోవచ్చు.
ఏడు నెలల విరామం తర్వాత టీమ్ ఇండియా తరపున రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే సిరీస్ లో అదరగొట్టాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మూడో వన్డేలో మాత్రం సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 202 రన్స్ చేసి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కూడా అవార్డు గెలుచుకున్నాడు.




















