Amarnath Yatra 2025 : అమర్‌నాథ్ యాత్ర ప్రారంభ తేదీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే.. ఆ సర్టిఫికెట్ లేకుంటే యాత్రకు అనుమతి ఉండదట, డిటైల్స్ ఇవే
Amarnath Yatra 2025 : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే దానికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. మరి ఆన్లైన్ ప్రాసెస్‌ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Amarnath Yatra 2025 Registration Process : అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ 2025 ప్రారంభమైపోయింది. ఏప్రిల్ 14వ తేది నుంచి ఈ స్లాట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు అమర్నాథ్కి వెళ్లి స్వయంభూని దర్శించుకోవాలనుకుంటే.. ఈ యాత్ర కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకీ అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఏ ప్రక్రియను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవికాలంలో అమర్‌నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ తీర్థయాత్రను మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ప్రారంభించి.. యాత్రకు వెసులుబాటు కల్పిస్తుంది. లక్షల్లో భక్తులు పాల్గొంటారు. దీనిలో భాగంగానే 2025కు గానూ.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను, ఎలా దరఖాస్తు చేయాలో చూసేద్దాం.
అమర్‌నాథ్ యాత్ర ఆన్లైన్ రిజిస్ట్రేషన్
అమర్‌నాథ్ యాత్రకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైపోయాయి. అమర్‌నాథ్ యాత్ర 2025లో జూన్ 29 నుంచి ఆగస్టు 19వ తేదీవరకు కొనసాగనుంది. మీరు ఇక్కడికి వెళ్లాలనుకుంటే.. అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ www.jksasb.nic.in ని సందర్శించాలి. సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది.
ధర ఎంతంటే..
ఆధార్, ఓటర్ ఐడీలు లేదా పాస్పోర్ట్లును ప్రూఫ్‌గా సబ్మీట్ చేయవచ్చు. ఏ ప్రూఫ్ ఇచ్చిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో కూడిన ఐడీనే ఇవ్వాలి. అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. అయితే బయట తీసుకునేది కాకుండా పుణ్యక్షేత్ర బోర్డు ఆమోదించిన వైద్యుడి నుంచి మాత్రమే వైద్య ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 150 డిపాజిట్ చేయాలి. సమయాన్ని బట్టి ఈ రిజిస్ట్రేషన్ ఫీజులలో మార్పులు ఉండొచ్చు. ఫారమ్ నింపిన తర్వాత మీ జర్నీకోసం అనుమతి పత్రం లభిస్తుంది. మీరు దానిని ప్రింట్ తీసుకుని జర్నీ సమయంలో మీ దగ్గర ఉంచుకోవాలి.
అమర్‌నాథ్ యాత్ర ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్..
మీరు ఆన్లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లో అమర్‌నాథ్ యాత్రకు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే.. మీరు బ్యాంకు నుంచి ట్రావెల్ ఫారమ్ తీసుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్‌లలో దీనిని సులభంగా పొందవచ్చు. అక్కడ మీరు మెడికల్ రిపోర్ట్‌ని చూపించి.. వారు ఇచ్చే ఫారమ్‌ని నింపి ప్రయాణానికి అనుమతి తీసుకోవచ్చు.
మెడికల్ రిపోర్ట్..
మెడికల్ రిపోర్ట్ లేకుండా మీరు అమర్‌నాథ్ యాత్ర చేసేందుకు అనుమతి లభించదు. అలా అని మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు. SASB వెబ్‌సైట్‌లో ఏ ఆస్పత్రిలో ఏ వైద్యుల దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలో లిస్ట్ ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫిట్‌గా ఉంటే వెంటనే అమర్‌నాథ్ యాత్రకోసం రిజిస్టర్ చేయించుకోండి. శివుని దర్శనం చేసేసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

