అన్వేషించండి

Stop Overthinking : అతిగా ఆలోచిస్తున్నారా? అయితే ఈ చిట్కాలతో ఓవర్​ థింకింగ్​ని ఓవర్​కామ్​ చేసేయండి

Quick Hacks to Stop Overthinking : జరిగింది. జరుగుతుంది. జరగబోయేది. ఇలా అన్నింటి గురించి ఆలోస్తూ తెగ అలసిపోతున్నారా? అయితే అతిగా ఆలోచించడానికి చెక్ పెట్టేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. 

Hacks to Stop Overthinking in Telugu : కొన్నిసార్లు ఇది సింపుల్ మ్యాటరే అని తెలిసినా కూడా ఎక్కువగా ఆలోచిస్తారు కొందరు. మరికొందరు తమకు ఆలోచిస్తున్నామని తెలియకుండానే బ్రెయిన్​లో ఓ బొమ్మ వేసుకుంటారు. మరికొందరు ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి.. దానిలోని పాజిటివ్, నెగిటివ్ అన్ని కోణాలు చించేస్తారు. ఇలా ఆలోచించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే కొన్నిసార్లు అస్సలు ఉండదు. మరి ఈ అతి ఆలోచనలు ఎలా కంట్రోల్ చేయాలి. 

అతిగా ఆలోచించడం వల్ల సొల్యూషన్ వస్తుందా అంటే రాదు. కానీ ఒత్తిడి ఎక్కువ వస్తుంది. తెలియకుండా ఓవర్ రియాక్ట్ అయిపోతారు. మానసికంగా వీక్​గా ఉంటారు. పైగా ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు చేయాలనుకున్న పనిని కూడా సరిగ్గా చేయరు. దానివల్ల వర్క్ పెండింగ్ అవుతుంది. స్ట్రెస్ రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే కొన్నిసింపుల్ చిట్కాలు ఫాలో అయితే ఓవర్​ థింకింగ్​కి చెక్​ పెట్టేయొచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

రాయండి

మీ ఆలోచనల్లో ఏమేమి ఉన్నాయో వాటిని రాస్తూ ఉండండి. ఇది మీకు క్లారిటీని ఇవ్వడంతో పాటు మైండ్​లోని ఆలోచనలను దూరం చేస్తుంది. మనసుకు హాయిగా కూడా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం మీరు వీటిని రాసుకుంటూ అది మీకు జర్నల్​గా ఉపయోగపడుతుంది. 

ఫోకస్ మార్చుకోండి..

మీ ఆలోచనల నుంచి మిమ్మల్ని బయటపడేసే పనులపై దృష్టి పెట్టండి. దీనివల్ల మీరు ఓవర్​ థింకింగ్ ఆపుతారు. వెంటనే ఆ పనులు చేసేయండి. 

బెస్ట్ చిట్కా ఇదే.. 

ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఉన్న ప్లేస్​ నుంచి బయటకు వెళ్లిపోండి. లేదా వాకింగ్ చేయడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మైండ్ త్వరగా డైవర్ట్ అవుతుంది. శారీరకంగా ఎంత యాక్టివ్​గా ఉంటే మైండ్ అంత సులువుగా ఆలోచనల నుంచి బయటపడుతుంది. 

5-4-3-2-1 గ్రౌండింగ్ టెక్నిక్

ఈ టెక్నిక్ కూడా ఈజీగా ఓవర్​ థింకింగ్​ని దూరం చేస్తుంది. 5 కనిపించే వస్తువులను 5 సెకన్లు చూడాలి. 4 వస్తువులను తాకాలి. 3 వినిపించే శబ్ధాలపై ఫోకస్ చేయాలి. 2 వాసనలు పీల్చాలి. ఒక దానిని రుచి చూడాలి. ఈ టెక్నిక్ ఆలోచనల్లో మునిగిపోయిన మనసును ప్రస్తుతానికి తీసుకువస్తుంది. 

ధ్యానం చేయడం.. 

మైండ్​ని డైవర్ట్ చేసి ప్రశాంతంగా ఉండేందుకు మీరు ధ్యానం చేయవచ్చు. ఇది మైండ్​ను శాంత పరుస్తుంది. మనసులో ఎలాంటివి వచ్చినా ఎదుర్కొనేందుకు మీరు రెడీగా ఉన్నారని మైండ్​ని ప్రిపేర్​ చేయండి. 

రిమైండర్.. 

మీరు ఏదైనా టాపిక్​లో డీప్​ డిగ్ చేస్తున్నారని అనిపిస్తే.. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఇదేమి పెద్ద మ్యాటర్​ కాదని మీకు మీరే చెప్పుకోండి. ఇది మీకు ఓవర్​ థింకింగ్​ని ఆపే రిమైండర్​గా హెల్ప్ అవుతుంది. ఎక్కువ ఆలోచిస్తున్నావని మీకు మీరు చెప్పుకున్నప్పుడు ఆలోచనలకు బ్రేక్​ పడతాయి. 

టైమర్

మీరు ఏదైనా విషయం గురించి ఆలోచించాలని అనుకుంటే మీరు టైమర్​ని పెట్టుకోండి. రోజుకు ఒకసారి 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఆ టాపిక్​ గురించి ఆలోచించండి. దీనివల్ల మీరు తక్కువ సమయంలో అన్ని పాజిబులిటీస్ చూడొచ్చు. పైగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాల గురించి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అయితే ఈ ఆలోచనల తర్వాత మళ్లీ మీ బ్రెయిన్ ఆ టాపిక్ గురించి ఆలోచించకుండా హెల్ప్ చేస్తుంది.

మాట్లాడండి..

మీరు ఏ విషయం గురించైనా పదే పదే ఆలోచిస్తున్నప్పుడు మీ బెస్ట్​ ఫ్రెండ్​ లేదా ఫ్యామిలీ మెంబర్​కో కాల్ చేసి.. మీ ఆలోచనలు పంచుకోండి. లేదా వాయిస్​ నోట్​గా పంపండి. దీనివల్ల మనసు క్లియర్ అవుతుంది. అలా పంపిన తర్వాత దాని గురించి ఆలోచించకుండా వదిలేయండి. 

ఇవన్నీ మీ ఓవర్ థింకింగ్​ని కంట్రోల్ చేసి మీరు ప్రస్తుతంలో ఉండేలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఆలోచనలతో బ్రెయిన్​ని ఓవర్​ కుక్ చేయకుండా.. సింపుల్​గా ఈ చిట్కాలు ఫాలో అయిపోయి రెస్ట్​ని ఇచ్చేయండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget